Jayalalithaa Health
-
మరోసారి పరీక్షలు.. చెన్నైలో హై అలర్ట్!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూసినట్టు వచ్చిన వదంతులను అపోలో ఆస్పత్రి తోసిపుచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి అన్నాడీఎంకే అగ్ర నేతల భేటీ వైపు మళ్లింది. జయలలిత ఆరోగ్యం తీవ్రంగా విషమించడం, ఆమె మృతి చెందినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అగ్రనేతలు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. జయలలిత వారసుడు ఎవరన్నదానిపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించినట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం వారసుడిపై ప్రకటన వెలువడే అవకాశముందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. జయలలిత నిచ్చెలి శశికళకు కూడా మంచి పదవి దక్కే అవకాశముందని వినిపిస్తోంది. అపోలో ఆస్పత్రిలో ఉన్న జయలలిత ఆరోగ్యంపై ఎయిమ్స్ వైద్యులు మరోసారీ పరీక్షలు నిర్వహించనున్నారని తెలుస్తోంది. జయలలిత గుండె పనితీరు, ఆరోగ్య పరిస్థితిపై మరోసారి పరీక్షలు నిర్వహించి.. రాత్రి 11 గంటలకు కీలక ప్రటకన చేసే అవకాశముందని సమాచారం. జయలలితకు ప్రస్తుతం న్యూరాలజిస్టులు చికిత్స అందిస్తున్నారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యవర్గాలు చెప్తున్న నేపథ్యంలో చెన్నైలో హై అలర్ట్ ప్రకటించారు. జయలలిత ఆరోగ్య పరిణామాల నేపథ్యంలో చెన్నై నగరమంతటా బంద్ తరహా వాతావరణం నెలకొంది. అడుగడుగున కేంద్ర బలగాలు, పోలీసులు మోహరించారు. -
మృతి వదంతి రేపింది ఈ చానెలే!!
సరిగ్గా సాయంత్రం 5.30 గంటల సమయం. ఒక్కసారిగా అలజడి. ఉద్రిక్తత. జయలలిత అభిమానులంతా చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రి దిశగా ఒక్కసారిగా పోటెత్తారు. పోలీసులను తోసుకుంటూ బారికేడ్లను దాటుకొని ఆస్పత్రిపై విరుచుకుపడ్డారు. రాళ్లు, కుర్చీలు, వాటర్ బాటిళ్లతో దాడులకు దిగారు. కారణం తమిళ చానెళ్లలో ఒక్కసారిగా గుప్పుమన్న కథనాలు... చెన్నైను ఒక్కసారిగా మునివేళ్లపై నిలబెట్టాయి. ఉద్రికత్తతో ఉక్కిరిబిక్కిరి చేశాయి. క్షణాల్లో ఈ కథనాలు దేశమంతటికీ పాకిపోయాయి. జాతీయ మీడియా చానెళ్లు సైతం జయలలిత కన్నుమూశారంటూ కథనాలు ఇచ్చాయి. నిజానికి అన్నింటికన్నా ముందు ఈ వదంతిని ప్రసారం చేసింది అన్నాడీఎంకే అధికారిక చానెల్ ‘జయ టీవీ’యేనని తెలుస్తోంది. జయలలిత కన్నుమూశారంటూ ఆ చానెల్ పొరపాటున ఆమె జ్ఞాపకాలను ప్రసారం చేయడంతో.. ఆ వెంటనే తమిళ చానెళ్లు జయలలిత కన్నుమూశారంటూ ఫ్లాష్ కథనాలు ప్రసారం చేశాయి. తమిళనాడు పరిణామాలను నిశితంగా గమనిస్తున్న జాతీయ చానెళ్లు కూడా జయలలిత కన్నుమూత బ్రేకింగ్స్ ఇచ్చాయి. అధికార అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలోని జెండాను సైతం సగం వరకు అవనతం చేశారు. దీంతో చెన్నై అంతటా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ వెంటనే అపోలో ఆస్పత్రి సైతం జోక్యం చేసుకొని వివరణ ఇవ్వడం, జయలలితకు లైఫ్‌సపోర్ట్ కొనసాగుతున్నదని స్పష్టత ఇవ్వడంతో ఉద్రిక్తత సడలింది. ముందుజాగ్రత్తగా పెద్ద ఎత్తున బలగాలను మోహరించడంతో పెద్దగా అవాంఛనీయ ఘటనలు జరగలేదు. మరోవైపు అపోలో ఆస్పత్రి ప్రకటనతో జయలలిత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. -
విస్తుపోయిన అభిమానులు
-
జయ ఆరోగ్యంపై అపోలో కీలక ప్రకటన
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆస్పత్రి సాయంత్రం 6 గంటలకు కీలక ప్రకటనను విడుదల చేసింది. జయలలిత కన్నుమూశారంటూ వచ్చిన వందతులు అపోలో ఆస్పత్రి తిరస్కరించింది. జయలలితకు ఇప్పటికీ లైఫ్ సపోర్ట్‌ను కొనసాగిస్తున్నామని, అపోలో, ఎయిమ్స్ వైద్యబృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నదని తెలిపింది. జయలలిత చనిపోయారని కొన్ని మీడియా చానెళ్లు తప్పుడు కథనాలు ప్రసారం చేశాయని, ఇవి పూర్తిగా నిరాధార, అసత్య కథనాలు అని అపోలో స్పష్టం చేసింది. తమ పత్రికా ప్రకటనను చూసైనా మీడియా తన తప్పుడు కథనాలను సరిచేసుకోవాలని హితవు పలికింది. అపోలో చీఫ్ ఆపరేటింగ్ అధికారి సుబ్బయ్య విశ్వనాథన్ ఈ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ ప్రకటనతో ఊపిరి పీల్చుకున్న జయలలిత అభిమానులు విజిల్స్ వేస్తూ.. చప్పట్లు కొడుతూ తమ హర్షం వ్యక్తం చేశారు. దీంతో తమిళనాడులో కొంత ఉద్రిక్తత సడలింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో సగం అవనతం చేసిన జెండా తిరిగి పూర్తిగా ఎగరవేశారు. మరోవైపు జయలలిత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. -
విస్తుపోయిన అభిమానులు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి చేసిన ప్రకటనతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అనారోగ్యం విషమించడంతో ‘అమ్మ’ కన్నుమూసిందని స్థానిక తమిళ చానళ్లు ప్రచారం చేయడంతో అభిమానులు, మద్దతుదారులు ఒక్కసారి విస్తుపోయారు. నిజంగానే ‘అమ్మ’ లేదనుకుని కన్నీరుమున్నీరయ్యారు. గుండెలు బాదుకుంటూ శోకసముద్రంలో మునిగిపోయారు. అయితే అవన్నీ వదంతులనీ అపోలో ఆస్పత్రి ప్రకటించాయి. జయలలితకు చికిత్స కొనసాగుతోందని వెల్లడించాయి. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ‘అమ్మ’ ప్రాణాలతోనే ఉందన్న ప్రకటనతో అభిమానులు తేరుకున్నారు. తమ నాయకురాలు కోలుకోవాలని దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. జయ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. -
జయ ఆరోగ్యంపై అపోలో కీలక ప్రకటన
-
జయపై రూమర్స్.. చెన్నై కుతకుత!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై వదంతులు రావడంతో చెన్నై అట్టుడికిపోయింది. జయలలిత కన్నుమూశారంటూ కథనాలు రావడంతో తమిళనాడు ఒక్కసారిగా వేడెక్కింది. జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రిపైకి అమ్మ అభిమానులు, అన్నాడీఎంకే శ్రేణులు దాడులు చేశారు. పెద్ద ఎత్తున హాహాకారాలు చేస్తూ విధ్వంసాలకు పూనుకున్నారు. ఆస్పత్రిపైకి రాళ్లతో విరుచుకుపడ్డారు. పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. జాతీయ మీడియా సంస్థలు సైతం జయలలిత కన్నుమూశారని కథనాలు ఇవ్వడంతో ఏం జరుగుతున్నదో అర్థం కాక చెన్నై నగరం కుతకుతలాడింది. అయితే, ఈ కథనాలను, వదంతులను అపోలో ఆస్పత్రి కొట్టిపారేసింది. జయలలిత ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగా ఉందని, ఆమెకు చికిత్స కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. జయలలిత ఆరోగ్యంపై తాము అధికారికంగా ఏమీ చెప్పకముందే ఆమె గురించి వదంతులు వచ్చినట్టు స్పష్టంచేసింది. అపోలో, ఎయిమ్స్‌కు చెందిన పెద్ద వైద్యబృందం అమ్మకు లైఫ్ సేవింగ్ చికిత్స కొనసాగిస్తున్నదని అపోలో ట్వీట్ చేసింది. అయితే, అంతకుముందు జయలలిత మృతి వార్తలు తీవ్ర కలకలం రేపాయి. ఏకంగా అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను సగంవరకు అవనతం చేశారు. జాతీయ మీడియా చానెళ్లు తమ ట్విట్టర్ పేజీల్లో జయలలిత మృతికి సంతాపం తెలుపుతూ పోస్టులు పెట్టారు. దీంతో జయలలిత నిజంగా చనిపోయారేమోనన్న భావన నెటిజన్ల ఏర్పడింది. చాలామంది సినీ ప్రముఖులు, నెటిజన్లు కూడా జయలలిత మృతిపై సంతాపం తెలుపుతూ పోస్టులు పెట్టారు. ఇక, తమిళనాడు అంతటా అమ్మ అభిమానుల హాహాకారాలు, విధ్వంసాలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. -
‘శుభవార్త వింటామన్న నమ్మకముంది’
చెన్నై: ‘మేం కళ్లలో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నాం. మాకు నమ్మకముంది. మేం త్వరలోనే శుభవార్త వింటాం’ .. జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రి ఎదుట భారీసంఖ్యలో గుమిగూడిన ఆమె అభిమానులను ఎవరినీ కదిలించినా.. వారి నోట ఇదే మాట వస్తున్నది. చెన్నైలోని అపోలో ఆస్పత్రి పరిసరాలు వేలాదిమంది జయలలిత అభిమానులతో కిక్కిరిసిపోయాయి. తమ అభిమాన నేత కోలుకోవాలని చాలామంది దేవుడిని ప్రార్థిస్తుండగా.. మరికొందరు భోరున విలపిస్తున్నారు. ఇంకొందరు ఏ క్షణం ఏ వార్త వినాల్సి వస్తుందోనని కలత చెందుతున్నారు. ప్రజానుకూల పథకాలు, విధానాలతో జనంలో గుండెల్లో ‘అమ్మ’గా కోలువైన జయలలిత ఆరోగ్యం తీవ్రంగా విషమించిందన్న వార్త తమిళనాడు అంతటా దావానలంలా పాకడంతో రాష్ట్రం నలుమూలల నుంచి ఆమె అభిమానులు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పెద్దసంఖ్యలో అన్నాడీఎంకే కార్యకర్తలు, నేతలు చెన్నైకి చేరుకుంటున్నారు. తిరువన్నమలై జిల్లా నుంచి వచ్చిన పరిమళ, నార్త్ చెన్నైకి చెందిన సుబ్రహ్మణియన్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ కోలుకుంటుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, ఆస్పత్రి వద్ద చాలామంది అమ్మ అభిమానుల్లో విషాదఛాయలు కనిపిస్తున్నాయి. జయలలిత నియోజకవర్గం ఆర్కే నగర్‌కు చెందిన వృద్ధ మహిళ రజినీ తరచూ భోరున విలపిస్తూ.. అమ్మ ఆరోగ్యం కోసం తపించడం చూపరులను కలిచివేస్తోంది. ఆమెకు జతకలిసిన పలువురు అభిమానులు కూడా కంటతడి పెట్టడం కనిపించింది. చెన్నై అంతటా అమ్మ అభిమానులు పోటెత్తుతుండటంతో వారిని అదుపు చేయడం పోలీసులకు చాలా కష్టంగా మారింది. చెన్నైలోని పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం అలుముకుంటోంది. ఈ నేపథ్యంలో అపోలో ఆస్పత్రి వద్ద రోగులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. -
‘తమిళనాడు వ్యవహారాల్లో జోక్యం చేసుకోం’
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో తమిళనాడుకు అదనపు బలగాలు పంపించేందుకు సిద్దంగా ఉన్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఏదైనా అవాంఛనీయ పరిస్థితులు తలెత్తితే వెంటనే స్పందిస్తామని చెప్పారు. తమిళనాడు ఎన్నికోరితే అన్ని అదనపు కేంద్ర బలగాలను పంపిస్తామన్నారు. అయితే ఇప్పటివరకు అధికారికంగా తమను కోరలేదని వెల్లడించారు. తమిళనాడులో సరిపడా కేంద్ర బలగాలు ఉన్నాయని తెలిపారు. తమిళనాడు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. ‘రాష్ట్రాల్లో శాంతి భద్రతలకు భంగం వాటిల్లినప్పుడు కేంద్రం బంగాలను పంపిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం కనీస కర్తవ్యం. సీఎం జయలలిత అనారోగ్యం నేపథ్యంలో తమిళనాడులో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు అదనపు బలగాలు పంపించేందుకు సిద్ధంగా ఉన్నామ’ని రిజిజు చెప్పారు. -
చెన్నైలో ఎటు చూసినా పోలీసులే
-
చెన్నైలో ఎటు చూసినా పోలీసులే
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై వదంతులను నమ్మొద్దని ప్రజలకు చెన్నై పోలీసులు విజ్ఞప్తి చేశారు. ‘అమ్మ’ ఆరోగ్యం విషమించిందన్న సమాచారంతో అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. భారీ సంఖ్యలో అపోలో ఆస్పత్రికి చేరుకుంటున్నారు. దీంతో ఆస్పత్రి పరిసరాల్లో భారీగా భద్రతా దళాలను మోహరించారు. చెన్నై మొత్తం ఆర్మీ, పోలీసు బలగాలతో నిండిపోయింది. జయలలిత నివాసం పొయెస్ గార్డన్ వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. చెన్నైలోని అన్ని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తమిళనాడులోని ప్రధాన నగరాల్లోనూ ముందు జాగ్రత్తగా భద్రత పెంచారు. మరోవైపు ‘అమ్మ’ కోలుకోవాలని అభిమానులు పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. ముంబైలోని శక్తి వినాయక ఆలయంలో అభిమానులు పూజలు చేశారు. జయలలిత ఆరోగ్యానికి సంబంధించిన వార్తల ప్రచారంలో నిగ్రహం పాటించాలని మీడియా సంస్థలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. -
‘తమిళనాడు వ్యవహారాల్లో జోక్యం చేసుకోం’
-
అమ్మ కోసం.. 25 రోజులుగా అక్కడే!
వాళ్లంతా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు. పనిచేసుకుంటే తప్ప పొట్ట నిండని పరిస్థితి వాళ్లది. చిన్నా చితకా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించే వాళ్లంతా.. గత 25 రోజులుగా ఆస్పత్రి వద్దే పడిగాపులు కాస్తున్నారు. తమవాళ్లు ఎవరికో ఆరోగ్యం బాగోలేదని కాదు.. తామంతా అమ్మగా భావించే జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నారని! అలాల్ బాయి (60) వెల్లూరు జిల్లా వనయింబాడి ప్రాంతంలో టైలర్ పని చేసుకుంటూ ఉంటారు. ఆమె సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ఇప్పటివరకు చెన్నై అపోలో ఆస్పత్రి బయటే పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆమె అక్కడే ఉంటారు. రాత్రిపూట మాత్రం ఎమ్మెల్యే హాస్టల్ కారిడార్లలో నిద్రపోతున్నారు. ప్రస్తుతానికి తాను వ్యాపారం మానేశానని, అమ్మ మెరుగవ్వాలని ప్రార్థిస్తున్నానని ఆమె చెప్పారు. సెప్టెంబర్ 22వ తేదీన జయలలిత 'జ్వరం, డీహైడ్రేషన్'తో అపోలో ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆమె ఐసీయూలోనే ఉన్నారు. ఒక్క శశికళ తప్ప.. మరెవ్వరికీ ఆమెను చూడటానికి కూడా అనుమతి లభించడం లేదు. మడిపాక్కం ప్రాంతానికి చెందిన సురేష్ బాబు (41) ఒక ప్రైవేటు కంపెనీ మార్కెటింగ్‌లో ఉన్నాడు. ఫార్మల్ దుస్తులలో తిరుగుతుండే అతను కూడా సెప్టెంబర్ 23 నుంచి అపోలో ఆస్పత్రివద్దే ఉంటున్నాడు. చాలాకాలంగా అన్నాడీఎంకే పార్టీ సభ్యుడైన సురేష్.. తనకు అమ్మ ఆరోగ్యం తప్ప ఏమీ అక్కర్లేదని చెప్పాడు. పలు ఆలయాల్లో రోజూ ప్రార్థనలు చేస్తున్నానని, పోయెస్ గార్డెన్‌కు కూడా రోజూ వెళ్తున్నానని అన్నాడు. మార్కెటింగ్‌లో ఉన్నందున రోజూ ఆఫీసుకు వెళ్లక్కర్లేదని, అందువల్ల ఫోన్లో క్లయింట్లతో మాట్లాడుకుని మేనేజ్ చేసుకుంటున్నానని తెలిపాడు. ఇంకా ఇలా చాలామంది అపోలో ఆస్పత్రి బయట వేచి చూస్తున్నారు. వేలాది మంది అక్కడే గుమిగూడటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇతర పేషెంట్ల బంధువులకు మాత్రం కొంత ఇబ్బంది తప్పడం లేదు. -
అమ్మ ఆరోగ్యం.. ఇంకా గోప్యమే
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకుంటున్నారని.. ఆమె చికిత్సకు స్పందిస్తున్నారని చెప్పడమే తప్ప ఇంతవరకు ఆమెకు వచ్చిన అనారోగ్యం ఏంటో, ఆమెకు ఎలాంటి చికిత్స చేస్తున్నారో ఇంతవరకు ఎక్కడా వెల్లడించలేదు. అంతేకాదు, గత వారం రోజుల నుంచి అసలు అమ్మకు సంబంధించిన హెల్త్ బులెటిన్లు కూడా ఇవ్వడం లేదు. అమ్మను పరామర్శించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దగ్గర్నుంచి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మాజీ గవర్నర్లు, కీలక నేతలు.. అనేకమంది రోజూ వస్తున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా వస్తారని చెబుతున్నారు. అయితే ఇంతవరకు ఎవ్వరినీ జయలలిత చికిత్స పొందుతున్న ఐసీయూ సమీపానికి కూడా వెళ్లనివ్వడం లేదు. ఎంత పెద్ద నాయకులైనా కేవలం వైద్యులతో మాట్లాడి వచ్చేయాల్సిందే. మరి ప్రధానమంత్రినైనా పంపుతారో లేదో చూడాలి. అపోలో ఆస్పత్రి వద్ద వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు గత 24 రోజులుగా గుమిగూడుతూనే ఉన్నారు. ఆమెకోసం ప్రత్యేకప్రార్థనలు, అన్నదానాలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. జయలలిత వాస్తవ పరిస్థితి ఏంటన్నది ఎవరికీ చెప్పడం లేదు. లండన్ నుంచి వచ్చిన ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టు డాక్టర్ రిచర్డ్ బాలే, ఎయిమ్స్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రత్యేక వైద్య నిపుణులతో పాటు చెన్నై అపోలో ఆస్పత్రి వైద్య బృందం ఈ 24 రోజుల నుంచి ఆమెను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. తాజాగా సింగపూర్ నుంచి కూడా వైద్యనిపుణులను రప్పిస్తున్నారు. అయితే.. కేవలం జ్వరం, డీహైడ్రేషన్, మధుమేహం లాంటి సామాన్య సమస్యలతోనే ఆస్పత్రిలో చేరిన జయలలిత ఇన్నాళ్లుగా ఎందుకు ఆస్పత్రిలో ఉండిపోవాల్సి వచ్చింది, ఆమె మళ్లీ తిరిగి అధికార పగ్గాలు ఎప్పుడు చేపడతారు అనే ప్రశ్నలు సామాన్య పౌరుల దగ్గర నుంచి పార్టీ అభిమానులు, నాయకులు, చివరకు ప్రస్తుతం ముఖ్యమంత్రి శాఖలన్నింటినీ చేపట్టిన ఆర్థికమంత్రి పన్నీరు సెల్వం వరకు అందరికీ వస్తున్నాయి. వాటికి సమాధానం ఇచ్చేవాళ్లు మాత్రం ఎవరూ లేరు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మాత్రం జయలలిత ఆరోగ్యం గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇటీవల అయితే.. జయలలిత కళ్లు తెరిచారని, వెంటిలేటర్ కూడా తీసేశారని విపరీతంగా ప్రచారం జరిగింది. జయలలిత చికిత్సకు వేగంగా స్పందిస్తున్నారని, ఆమె పేపర్లు కూడా చదువుతున్నారని అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి చెప్పారు. వీళ్లందరూ చెప్పే మాటల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో.. దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదదో మాత్రం సామాన్య ప్రజలకు ఎవరికీ అర్ధం కావడం లేదు. ఎందుకు ఇంత గోప్యత పాటించాల్సి వస్తోందో అర్థం కావడం లేదు. అపోలో వైద్యులు మధ్యమధ్యలో ఒకోసారి అమ్మ ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్లు జారీ చేస్తున్నారు. సాధారణంగా హెల్త్ బులెటిన్ అంటే, అందులో షుగర్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, సాధారణ ఆరోగ్యానికి సంబంధించిన ఇతర పారామీటర్లు ఎలా ఉన్నాయన్న వివరాలు ఉంటాయి. కానీ జయలలిత హెల్త్ బులెటిన్‌లో మాత్రం ఆమె చికిత్సకు స్పందిస్తున్నారని, మరికొంత కాలం ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని మాత్రమే చెబుతున్నారు. ఇంతకుముందు విడుదల చేసిన బులెటిన్‌లో... ఊపిరితిత్తుల్లో శ్లేష్మపొరను తొలగించే మందులు వాడుతూ మరింత జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామని, ఫిజియోథెరపీ ద్వారా ఊపిరి తీసుకునేందుకు సహకారం అందిస్తున్నామని వెల్లడించారు. ఇంటెన్సివిస్ట్ల ఆధ్వర్యంలో సీఎం ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇంకా చాన్నాళ్లే జయ ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందని.. పునరుద్ఘాటించారు. అలాగే వైద్యచికిత్సలో అన్నిరకాల సమగ్ర చర్యల్లో భాగంగా పౌష్టికాహారాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. జయలలిత ఆరోగ్యం గురించిన వివరాలను వెల్లడించాలని, ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోలను విడుదల చేయాలని డీఎంకే అధినేత కరుణానిధి చేసిన డిమాండును అన్నాడీఎంకే వర్గాలు తోసిపుచ్చాయి. తాము ప్రజలకు జవాబుదారీ తప్ప డీఎంకేకు కాదని చెప్పాయి. దీంతో అసలు ఏం జరుగుతోందోనన్న ఆందోళన ప్రజల్లో కలిగింది. కానీ వీటిన్నింటికీ సమాధానాలు మాత్రం రావడం లేదు. -
అమ్మ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా
గత 25 రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి 'పురచ్చితలైవి' జయలలిత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ట్వీట్లో తెలిపారు. ఆమె వీలైనంత త్వరగా మళ్లీ ప్రజాసేవలోకి వచ్చేందుకు దేవుడు ఆమెను అనుమతించాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్, మధుమేహంతో సెప్టెంబర్ 22వ తేదీన చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత, అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. లండన్ నుంచి, ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి కూడా ప్రత్యేక వైద్యులు వచ్చి ఆమె చికిత్సను పర్యవేక్షిస్తున్నారు. ఆమె వద్ద ఉన్న ప్రభుత్వ శాఖలను ఆర్థికమంత్రి పన్నీరు సెల్వంకు అప్పగించిన విషయం కూడా తెలిసిందే. Praying for the speedy recovery of Puratchi Talaivi J. Jayalalitha. May God allow her to be in service of the people at the earliest — YS Jagan Mohan Reddy (@ysjagan) 15 October 2016 -
సీఎంపై ట్విట్టర్లో భారీగా ప్రచారం
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై వస్తున్న వదంతులను ఖండించేందుకు అన్నాడీఎంకే పార్టీ నడుం కట్టింది. సోషల్ మీడియాలో దీనిపై ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. అమ్మ ఆరోగ్యం గురించి రకరకాల వదంతులు ప్రచారం అవుతుండటంతో.. వాటిని ఖండించడానికి ట్విట్టర్ వేదికగా ప్రచారం ప్రారంభించింది. 'మై సీఎం ఈజ్ ఫైన్', 'నో మోర్ రూమర్స్' అనే హ్యాష్ ట్యాగ్‌లతో కూడిన ప్రచారాన్ని మొదలుపెట్టడంతో చాలామంది అన్నాడీఎంకే అభిమానులు తమ ప్రొఫైల్ పిక్చర్లను కూడా మార్చేసుకున్నారు. ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి కూడా నిపుణులు రావడంతో ఆమె అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్న ప్రచారం జరిగింది. అయితే ఆస్పత్రి వర్గాలు మాత్రం జయలలిత చికిత్సకు స్పందిస్తున్నారని, ఆమె బాగా కోలుకుంటున్నారని చెబుతున్నాయి. జయలలిత ఆరోగ్యంగా ఉన్నట్లు సాక్ష్యంగా ఫొటోలు బయటపెట్టాలని డీఎంకే అధినేత కరుణానిధి డిమాండ్ చేసినా.. ప్రభుత్వం వైపు నుంచి మాత్రం స్పందన రాలేదు. తాము ప్రజలకే తప్ప ప్రతిపక్షానికి జవాబుదారీ కాదని అప్పట్లో అన్నారు. All is well with Puratchi Thalaivi Amma. Click this link, change your profile pic & put a full stop to rumours.https://t.co/mOwR6jaOWx — AIADMK (@AIADMKOfficial) 10 October 2016 -
అమ్మ కోసం ప్రార్ధనలు
-
ఆస్పత్రిలోనే అమ్మ...
-
ఆస్పత్రిలోనే అమ్మ!
మరికొన్నాళ్లు చికిత్స అవసరం - జయలలిత ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వర్గాల వివరణ - తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలో అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు - ఆస్పత్రిలో జయను పరామర్శించిన గవర్నర్ విద్యాసాగర్‌రావు చెన్నై: పదిరోజులుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలిత (68) కోలుకుంటున్నారని అపోలో ఆస్పత్రి అన్నాడీఎంకే వర్గాలు వెల్లడించాయి. జ్వరం, డీ హైడ్రేషన్ సమస్యలతో సెప్టెంబర్ 22న ఆస్పత్రిలో చేరిన జయ ఆరోగ్యంపై ఆసుపత్రి వర్గాలు, పార్టీ కార్యాలయం ఏ ప్రకటన చేయకపోవటంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. అయితే శనివారం సాయంత్రం జయను పరామర్శించిన తమిళనాడు ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు, వైద్యుల సంరక్షణలో ఆమె కోలుకుంటున్నారని తెలిపారు. ఆస్పత్రి యాజమాన్యం కూడా రెండ్రోజుల తర్వాత అమ్మ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేసింది. ‘వైద్యుల చికిత్సకు సీఎం బాగానే స్పందిస్తున్నారు. అవసరమైన పరీక్షలు నిర్వహించాం. కొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉంటే అన్నీ కుదురుకుంటాయి. త్వరలోనే జయ పూర్తిస్థాయిలో కోలుకుంటారు’ అని అపోలో సీవోవో సుబ్బయ్య విశ్వనాథన్ తెలిపారు. మరోవైపు, లండన్ నుంచి వచ్చిన ఇంటెన్సిటివ్ నిపుణుడు డాక్టర్ రిచర్డ్ జాన్ బేల్ నేతృత్వంలో వైద్యుల బృందం జయకు చికిత్సనందిస్తోంది. సర్కారు అంతా ఆస్పత్రి వద్దే..: సీఎం ఆరోగ్య పరిస్థితిపై పుకార్లు వెల్లువెత్తటంతో ఆస్పత్రి వద్ద అన్నాడీఎంకే కార్యకర్తలతోపాటు అభిమానులు క్యూ కట్టారు. మంత్రులు, పార్టీ కీలక నేతలు, సీఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులంతా ఆస్పత్రి వద్దే ఉన్నారు. ఆస్పత్రి వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆస్పత్రి నుంచే పాలన..: జయ వైద్యుల సంరక్షణలో కోలుకుంటున్నారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి పి. వళరమతి తెలిపారు. ‘అమ్మ బాగానే ఉన్నారు. చికిత్స పొందుతూనే ఆస్పత్రి నుంచే పాలనను పర్యవేక్షిస్తున్నారు. ఈ నెలలో జరిగే స్థానిక ఎన్నికలకు పార్టీ అభ్యర్థులనూ ప్రకటించారు. కొందరు గిట్టనివారు అమ్మ ఆరోగ్యంపై అనవసరంగా పుకార్లు పుట్టిస్తున్నారు’ అని తెలిపారు. వారం రోజులుగా అపోలో ఆస్పత్రి నుంచే సర్కారు అధికారిక ప్రెస్నోట్లు విడుదలవుతున్నాయి. జయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే కావేరీ జలాలపై సుప్రీంకోర్టు తీర్పు వంటి అంశాలను గమనిస్తున్నట్లు తెలిసింది. డాక్టర్లు మాత్రం జయ పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి చేరవేస్తున్నారు. అయితే జయను పరామర్శించి వచ్చిన నేతలు మాత్రం.. ఆమె కోలుకుంటున్నారని.. త్వరలోనే ఆరోగ్యంగా పోయెస్ గార్డెన్‌కు వస్తారని ప్రకటిస్తున్నారు. డాక్టర్లు సూచించినట్లుగా కాస్త విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని అన్నాడీఎంకే ప్రతినిధి రామచంద్రన్ తెలిపారు. జయ కోలుకుంటున్నారు: గవర్నర్ జయలలితను ఇంచార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు పరామర్శించారు. జయ ఆరోగ్యంపై వదంతులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో గవర్నర్ పరామర్శించటం ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు 35 నిమిషాల సేపు ఆసుపత్రిలోనే ఉన్న గవర్నర్‌కు అపోలో గ్రూపు చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి.. ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న చికిత్సను వివరించారు. ‘జయలలిత కోలుకుంటున్నారు. ఆమెకు అందుతున్న వైద్య సేవల పట్ల సంతృప్తిగా ఉంది’ అని రాజ్‌భవన్ నుంచి విడుదలైన ప్రకటనలో గవర్నర్ విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారా? జయలలిత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే.. రాజకీయ సమస్యలు, కోర్టు కేసులు, మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆరోగ్యంపై దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్నప్పుడూ జయ ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని తమిళనాడు సర్కారు కోర్టును కోరింది. చాలా కాలంగా అమ్మ మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఉదయం నుంచి టెన్షన్.. టెన్షన్ పదిరోజులుగా జయలలిత ఆస్పత్రిలో ఉన్నా.. శనివారం మాత్రం చెన్నైలో హైడ్రామా నడిచింది. శనివారం మధ్యాహ్నం నుంచి అమ్మను సందర్శించేందుకు ఆస్పత్రికి వీఐపీలు పెద్ద సంఖ్యలో రావటంతో అభిమానుల్లో ఆందోళన రెట్టింపైంది. దీంతోపాటు మీడియాలో రకరకాల వార్తలు రావటంతో ఆస్పత్రికి అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తల తాకిడి పెరిగింది. అమ్మ ఆరోగ్యంపై వదంతులను ప్రచారం చేస్తున్న పలువురిపై పోలీసులు కేసులు పెట్టారు. ఫ్రాన్స్‌లోని తమిళచ్చి అనే ఓ యువతి.. ఫేస్బుక్లో పెట్టిన అభ్యంతరకరమైన పోస్టుతో.. ఆమెపై సైబర్ క్రైమ్ కేసు నమోదైంది. జయ ఆరోగ్యంపై పదిరోజుల్లో 3 బులెటిన్లే విడుదలవటం, రెండ్రోజులుగా ఆస్పత్రి వర్గాలుఏమీ చెప్పకపోవటంతో అమ్మ అభిమానుల్లో ఆందోళన ఎక్కువైంది. దీంతో వేల సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు రేయింబవళ్లు ఆస్పత్రి వద్దే పడిగాపులు కాస్తున్నారు. -
జయలలిత ఆరోగ్యంపై గవర్నర్ ప్రకటన
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ఇన్చార్జ్ గవర్నర్ సీఎచ్ విద్యాసాగర్ రావు శనివారం రాత్రి ఓ ప్రకటన చేశారు. అనారోగ్యంతో ఉన్న సీఎం జయలలిత కోలుకుంటున్నారని ఆయన తెలిపారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను ఆయన పరామర్శించిన సంగతి తెలిసిందే. అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లిన విద్యాసాగర్‌రావు ఈ ప్రకటన వెలువరించారు. జయలలిత త్వరగా సంపూర్ణంగా కోలుకోవాలని ఆయన ఆక్షాంక్షించారు. (తమిళనాట సర్వత్రా ఉత్కంఠ!) జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆస్పత్రి చైర్మన్ పత్రాప్ రెడ్డి తనకు వివరించారని గవర్నర్ తెలిపారు. జయలలితకు చికిత్స అందిస్తున్న డాక్టర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్ ప్రకటనతో జయలలిత ఆరోగ్యంపై ఆమె అభిమానుల్లో ఆందోళన కొంత తగ్గింది. -
అమ్మకేమైంది?
-
తమిళనాట సర్వత్రా ఉత్కంఠ!
చెన్నై అపోలో ఆస్పత్రి వద్ద ఉద్వేగభరిత వాతావరణం చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. వారం రోజులుగా ఆస్పత్రిలో ఉన్న జయలలిత ఆరోగ్యం గురించి వైద్యులు ఎలాంటి ప్రకటన చేయకపోవడం తమిళనాడులో ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో అమ్మ ఆరోగ్య పరిస్థితిపై రాజ్‌భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. జయలలితను పరామర్శించిన అనంతరం ఇన్చార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు నేరుగా రాజ్‌భవన్ వెళ్లి.. ఈ ప్రకటన విడుదల చేశారు. జయలలిత కోలుకుంటున్నదని ఆయన తెలిపారు. ఆమె సంపూర్ణంగా కోలుకోవాలని ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మరో రెండురోజులు చెన్నైలోనే ఉండనున్నారు. అయితే, అభిమానులు, అన్నాడీఎంకే శ్రేణుల ఆందోళన దృష్ట్య చికిత్స పొందుతున్న జయలలిత ఫొటోలను విడుదల చేసే అవకాశముంది. జయ అనారోగ్యం నేపథ్యంలో చెన్నై అపోలో ఆస్పత్రికి తమిళనాడు మంత్రులు, అన్నాడీఎంకే నేతలు, శ్రేణులు పెద్దసంఖ్యలో చేరుకుంటున్నారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను తమిళనాడు ఇన్చార్జి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు రాత్రి 7 గంటలకు పరామర్శించారు. గవర్నర్‌తోపాటు జయలలిత కేబినెట్ మంత్రులంతా ఆస్పత్రి చేరుకోవడంతో ఆస్పత్రి వద్ద ఉద్వేగపూరిత వాతావరణం నెలకొంది. 'అమ్మ' అని ఆత్మీయంగా పిలుచుకునే జయలలిత ఆరోగ్యంపై అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. ఆస్పత్రి వద్ద పెద్దస్థాయిలో పోలీసులను మోహరించారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై గత రెండురోజులుగా వైద్యులు బులిటెన్ విడుదల చేయలేదని తెలుస్తోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యవర్గాలు ఏమీ చెప్పకపోవడం కూడా ఉత్కంఠ రేపుతోంది. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై గవర్నర్ అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. జయలలితకు మెరుగైన చికిత్స అందజేసేందుకు విదేశాలకు తరలించే అవకాశముందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత వారం రోజులుగా ఆస్పత్రిలో ఉన్న అమ్మ (జయలలిత) ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఇంగ్లండ్ నుంచి వచ్చిన ఓ ప్రత్యేక వైద్యుడి పర్యవేక్షణలో చెన్నైలో ఆమెకు చికిత్స అందిస్తున్నట్టు అన్నాడీఎంకే తెలిపిన సంగతి తెలిసిందే. జయలలిత తీవ్ర అస్వస్థతతో ఉన్నట్టు వచ్చిన వదంతులను ఆ పార్టీ తోసిపుచ్చింది. -
అమ్మ.. ఫొటోలు ఇవ్వం!
-
యూకే వైద్యుడి పర్యవేక్షణలో అమ్మ.. ఫొటోలు ఇవ్వం!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అనారోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికార పార్టీ స్పందించింది. గత వారం రోజులుగా ఆస్పత్రిలో ఉన్న అమ్మ (జయలలిత) ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఇంగ్లండ్ నుంచి వచ్చిన ఓ ప్రత్యేక వైద్యుడి పర్యవేక్షణలో చెన్నైలో ఆమెకు చికిత్స అందిస్తున్నట్టు అన్నాడీఎంకే తెలిపింది. జయలలిత తీవ్ర అస్వస్థతతో ఉన్నట్టు వచ్చిన వదంతులను ఆ పార్టీ తోసిపుచ్చింది. జయలలిత ప్రస్తుత పరిస్థితిని తెలిపేందుకు ఫొటోలు విడుదల చేయాలన్న డిమాండ్‌ను తోసిపుచ్చింది. ‘అమ్మ కోలుకుంటున్నది. త్వరలోనే ఆమె డిశ్చార్జ్ అవుతారని భావిస్తున్నాం. జయలలిత ఫొటోలు విడుదల చేయాలన్న అవసరం లేదని భావిస్తున్నాం. మేం ప్రజలకు మాత్రమే జవాబుదారీ. ప్రతిపక్షాలకు కాదు’అని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి పన్రుతి ఎస్ రామచంద్రన్ శనివారం విలేకరులకు తెలిపారు. జయలలిత అనారోగ్యంపై ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని, ఆమె ప్రస్తుత ఫొటోలను విడుదల చేయాలని ప్రతిపక్ష డీఎంకే అధినేత ఎం కరుణానిధి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని తమిళనాడు గవర్నర్ సీఎచ్ విద్యాసాగర్‌రావును ఆయన కోరారు. -
‘జయలలిత అనారోగ్యంపై వదంతులు’
-
‘జయలలిత అనారోగ్యంపై వదంతులు’
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు ప్రభుత్వం అడ్డుకట్టవేయాల్సిన అవసరముందని డీఏంకే అధినేత ఎం. కరుణానిధి అన్నారు. జయలలిత అనారోగ్యంకు సంబంధించిన వివరాలు వెల్లడించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ‘గతంలోనే చెప్పినట్టుగా జయలలిత సిద్ధాంతాలతో నేను విభేదిస్తున్నాను. అయితే అనారోగ్యం బారిన పడిన ఆమె త్వరగా కోలుకుని అధికార విధులకు హాజరు కావాలని కోరుకుంటున్నాను. జయలలిత అనారోగ్యంపై కొంతమంది అవాంఛిత వదంతులు ప్రచారం చేస్తున్నందున అపోలో ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్లు విడుదల చేయాల’ని ఆయన సూచించారు. ‘సోషల్ మీడియాలో కొంత మంది వ్యక్తులు జయలలిత ఆరోగ్యంపై పుకార్లు సృష్టిస్తున్నారు. అధికారిక ప్రకటన చేసి వీటికి అడ్డుకట్టవేయాలి. ఆస్పత్రిలో ఉన్న జయలలిత ఫొటోలు మీడియాకు విడుదల చేసి వదంతులు వ్యాపింపజేయకుండా చేయాల’ని కరుణానిధి అన్నారు. 68 ఏళ్ల జయలలిత జ్వరం, డీహైడ్రేషన్ కారణంగా ఈ నెల 22న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. మరిన్ని రోజులు చికిత్స అవసరమని ఆమెకు వైద్యులు సూచించారు. -
జయ ఆరోగ్యంపై మాట్లాడితే నాలుకలు చీరేస్తాం
టీనగర్: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యంపై అనవసరంగా మాట్లాడితే వారి నాలుకలు చీరేస్తామని అన్నాడీఎంకే ఎంపీ బహిరంగంగా హెచ్చరించడంతో సంచలనం చెలరేగింది. నామక్కల్ జిల్లా, రాసిపురం కొత్త బస్టాండు ఎంజీఆర్ విగ్రహం సమీపంలో అన్నాడీఎంకే ప్రభుత్వ నాలుగేళ్ల ప్రగతిని వివరిస్తూ బహిరంగ సభ శనివారం రాత్రి జరిగింది. ఇందులో కార్మిక శాఖా మంత్రి తంగమణి, నామక్కల్ ఎంపీ సుందరం, రాసిపురం మునిసిపల్ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకే ఎంపీ సుందరం మాట్లాడుతూ ప్రధాని మోదీ భూసేకరణ చట్టంపై మద్దతు కోరేందుకు ముఖ్యమంత్రి జయలలితను కోరారని, ఆమె మద్దతు ఇస్తేనే ఈ చట్టం నెరవేరుతుందన్నారు. రాష్ట్రంలో ఎంత మంది ముఖ్యమంత్రులు ఉన్నారనేది అర్ధం కావడం లేదని, పీఎంకే వారు కోవైలో మహానాడు నిర్వహించి అన్బుమణి తదుపరి సీఎం అంటున్నారని ఎద్దేవా చేశారు. టాస్మాక్ దుకాణాలను మూసివేస్తామని అంటున్న వారు మహానాడు జరిపిన సమయంలో కోవైలో *కోటి విలువగల మద్యం విక్రయాలు జరిగాయని ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్‌కు అవినీతి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. జయలలితను విశ్రాంతి తీసుకోమని కొంతమంది కోరుతున్నారని, జయలలిత ఆరోగ్యంపై అనవసరంగా మాట్లాడితే వారి నాలుకలు చీరేస్తామని హెచ్చరించారు.