సీఎంపై ట్విట్టర్‌లో భారీగా ప్రచారం | aiadmk starts twitter campaign on jayalalithaa health | Sakshi
Sakshi News home page

సీఎంపై ట్విట్టర్‌లో భారీగా ప్రచారం

Oct 10 2016 2:31 PM | Updated on Aug 25 2018 6:37 PM

సీఎంపై ట్విట్టర్‌లో భారీగా ప్రచారం - Sakshi

సీఎంపై ట్విట్టర్‌లో భారీగా ప్రచారం

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై వస్తున్న వదంతులను ఖండించేందుకు అన్నాడీఎంకే పార్టీ నడుం కట్టింది.

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై వస్తున్న వదంతులను ఖండించేందుకు అన్నాడీఎంకే పార్టీ నడుం కట్టింది. సోషల్ మీడియాలో దీనిపై ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. అమ్మ ఆరోగ్యం గురించి రకరకాల వదంతులు ప్రచారం అవుతుండటంతో.. వాటిని ఖండించడానికి ట్విట్టర్ వేదికగా ప్రచారం ప్రారంభించింది. 'మై సీఎం ఈజ్ ఫైన్', 'నో మోర్ రూమర్స్' అనే హ్యాష్ ట్యాగ్‌లతో కూడిన ప్రచారాన్ని మొదలుపెట్టడంతో చాలామంది అన్నాడీఎంకే అభిమానులు తమ ప్రొఫైల్ పిక్చర్లను కూడా మార్చేసుకున్నారు.

ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి కూడా నిపుణులు రావడంతో ఆమె అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్న ప్రచారం జరిగింది. అయితే ఆస్పత్రి వర్గాలు మాత్రం జయలలిత చికిత్సకు స్పందిస్తున్నారని, ఆమె బాగా కోలుకుంటున్నారని చెబుతున్నాయి. జయలలిత ఆరోగ్యంగా ఉన్నట్లు సాక్ష్యంగా ఫొటోలు బయటపెట్టాలని డీఎంకే అధినేత కరుణానిధి డిమాండ్ చేసినా.. ప్రభుత్వం వైపు నుంచి మాత్రం స్పందన రాలేదు. తాము ప్రజలకే తప్ప ప్రతిపక్షానికి జవాబుదారీ కాదని అప్పట్లో అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement