తెలంగాణకు ఇచ్చిన హామీలేమైనట్టు? | Ponguleti comments on Amit Shah | Sakshi
Sakshi News home page

తెలంగాణకు ఇచ్చిన హామీలేమైనట్టు?

May 24 2017 3:04 AM | Updated on Mar 29 2019 9:31 PM

రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలు సంగతి ఏమైందో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా చెప్పాలని శాసనమండలిలో కాంగ్రెస్‌ ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

అమిత్‌షాకు పొంగులేటి ప్రశ్న

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలు సంగతి ఏమైందో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా చెప్పాలని శాసనమండలిలో కాంగ్రెస్‌ ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ అమిత్‌షా పర్యటన కేవలం అధికార యావతో చేసినట్టుంద న్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా విభజన హామీలను అమలు చేయకపోవడం సరికాదన్నారు.

అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు సీఎం కేసీఆర్‌కూ పోలవరం ముంపు మండలాల దుస్థితి పట్టదన్నారు. రైతులకు మద్దతు ధర కోసం కేంద్రం ఇచ్చిన ఐదువేల రూపాయలు ఏ రైతు ఖాతాలోనై నా జమ అయినాయా అని ప్రశ్నించారు. తెలంగాణ లో ఉన్న ఏ సమస్యపైనా అమిత్‌షా మా ట్లాడకపోవడం దుర్మార్గమన్నారు. ఖాజీ పేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ వంటివాటిపై ఎందుకు మాట్లాడలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement