ప్రేమ వివాహంగా తేలిన కిడ్నాప్ వ్యవహారం | not kidnaped its love marriage says girl | Sakshi
Sakshi News home page

ప్రేమ వివాహంగా తేలిన కిడ్నాప్ వ్యవహారం

Jun 17 2016 9:02 PM | Updated on Sep 4 2017 2:44 AM

మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన కిడ్నాప్ కేసు కొత్త మలుపు తిరిగింది.

రాజేంద్రనగర్: మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన కిడ్నాప్ కేసు కొత్త మలుపు తిరిగింది. తన ఇష్టపూర్వకంగా యువకుడితో వెళ్ళి వివాహం చేసుకున్నట్లు యువతి పోలీసులకు వెల్లడించింది. ఈ విషయమై ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ... బుధవారం రాత్రి దుర్గానగర్ ప్రాంతానికి చెందిన అర్చన అదే ప్రాంతానికి చెందిన సాయికుమార్‌తో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి, శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలో పెళ్లి చేసుకున్నారిని తెలిపారు.

అనంతరం శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న యువతి తన ఇష్టపూర్వకంగా ప్రేమించిన యువకుడితో వెళ్లినట్లు తెలపడంతో.. తాము యువకుడి తల్లిదండ్రులను పిలిపించి వారిని అప్పగించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement