చంద్రబాబు వైఖరి వల్లే ముద్రగడ ఆందోళన | narayana criticises chandrababu on mudragada padmanabham fast | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వైఖరి వల్లే ముద్రగడ ఆందోళన

Jun 12 2016 2:18 AM | Updated on Aug 13 2018 4:30 PM

ఓట్ల కోసం చంద్రబాబు ఆడిన అబద్ధాలే కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆందోళనకు దారి తీసిందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ విమర్శించారు.

  •  సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ
  • కోదండరామ్‌పై దాడి మీ పతనానికి నాంది
  • కేసీఆర్‌పై విమర్శలు
  •  
     సాక్షి, న్యూఢిల్లీ: ఓట్ల కోసం చంద్రబాబు ఆడిన అబద్ధాలే కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆందోళనకు దారి తీసిందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ విమర్శించారు. శనివార ం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు బూటకపు హామీలు ఇవ్వడంతోనే ముద్రగడ ఆందోళన చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.  జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ తీరునూ ఆయన విమర్శించారు. ‘ముద్రగడ దీక్ష చేస్తున్నారు, వారిపై ప్రభుత్వం దాడులు చేస్తోంది. మరి పవన్‌కల్యాణ్ ఎక్కడ దాక్కున్నార న్నారు? ఇలాంటి సమయంలో ముందుకు రాకపోతే ఆయన ఎప్పుడో వచ్చి చెప్పే నీతులు ఎవరూ నమ్మరు’ అని చెప్పారు. ముద్రగడ దీక్ష విరమించేవరకు సాక్షి చానెల్ ప్రసారాలు నిలిపివేస్తామని హోం మంత్రి వ్యాఖ్యలపై స్పందిస్తూ..ఇది ప్రజాస్వామ్యమని, పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడమేనని పేర్కొన్నారు. మీడియాపై ఆంక్షలు విధిస్తే పాలకపక్షం పతనానికి దారి తీస్తుందని చెప్పారు.

    కోదండరామ్ ఏం మాట్లాడారని మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారు. ఆయనపై దాడి చేయడం మీ పతనానికి మీరే పునాదులు వేసుకున్నట్లు అని నారాయణ పేర్కొన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని మంత్రులుగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా నియమించారని కేసీఆర్‌ను విమర్శించారు.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement