'పాలమూరును ఈ ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రాణహిత ప్రాజెక్ట్ అంచనాలు పెంచి పాత కాంట్రాక్టర్లకే ఇచ్చారు. ఇది ప్రభుత్వమా లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా.. అధికారంలోకి రాగానే టీఆర్‌ఎస్ ప్రభుత్వం దోపిడీకి తెరలేపింది' అని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్ : 'పాలమూరును ఈ ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రాణహిత ప్రాజెక్ట్ అంచనాలు పెంచి పాత కాంట్రాక్టర్లకే ఇచ్చారు. ఇది ప్రభుత్వమా లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా.. అధికారంలోకి రాగానే టీఆర్‌ఎస్ ప్రభుత్వం దోపిడీకి తెరలేపింది' అని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి మండిపడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కరువుతో అల్లాడుతున్నారు. పశుసంపదను కూడా కాపాడలేని అసమర్ధ నాయకుడు రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్ అసలు సిసలైన తెలంగాణవాదేనా.. కాదా ప్రశ్నించుకోవాలన్నారు.