యూఏఈలో నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాలకు ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరవుతున్నట్లు సాక్షికి ఈమెయిల్ ద్వారా తెలిపారు.
- ఈటీసీఏ అధ్యక్షుడు పీచర్ల కిరణ్‌కుమార్
రాయికల్
యూఏఈలోని ఉమల్‌కోయిన్‌లో ఇండియన్ అసోసియేషన్, ఈటీసీఏ సహకారంతో నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాలకు తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరవుతున్నట్లు ఈటీసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు పీచర్ల కిరణ్‌కుమార్ మంగళవారం సాక్షికి ఈమెయిల్ ద్వారా తెలిపారు. ఉమల్‌కోయిన్‌లోని ఇండియన్ అసోసియేషన్ హాల్‌లో నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో ఎంపీ పాల్గొనున్నట్లు తెలిపారు. అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.