
'ఉత్తమ్ జడలు పెంచుకోవాల్సిందే'
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరిక నెరవేరకపోవచ్చని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు.
నిజామాబాద్: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరిక నెరవేరకపోవచ్చని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. ఆ కోరిక పెట్టుకుంటే ఆయన గెడ్డానికి బదులు జడలు పెంచుకోవాల్సి వస్తుందని విమర్శించారు. నిజాం షుగర్స్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఆమె అన్నారు. ఇప్పటి వరకు రూ.50కోట్లు చెల్లింపులు చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేనని కవిత చెప్పారు.
వరదలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఆమె భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ తప్పుడు సర్వేలు చేయించిందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే అత్యధిక స్థానాలు తమకే వస్తాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎంపీ కవిత కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.