'దత్తాత్రేయను కవిత కలవడం ఓ డ్రామా'

'దత్తాత్రేయను కవిత కలవడం ఓ డ్రామా'


హైదరాబాద్ : బీడీ, సిగరెట్ ప్యాకెట్లపై పుర్రె గుర్తు శాతం తగ్గించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ మధుయాష్కీ గురువారం హైదరాబాద్లో ఆరోపించారు. ఈ అంశాన్ని టీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో లేవనెత్తలేదని ఆయన విమర్శించారు.


ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే పుర్రె గుర్తు శాతం తగ్గించడంపై ప్రధాని, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని కలవాలని టీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ఇప్పటికే ఈ అంశంపై నిజామాబాద్ ఎంపీ కవిత కేంద్ర మంత్రి దత్తాత్రేయను కలవడం ఓ డ్రామా అని మధుయాష్కీ అభివర్ణించారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top