
కోర్టుకు హాజరైన జయసుధ
ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులో సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ సోమవారం సికింద్రాబాద్ 10వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టుకు హాజరయ్యారు.
చిలకలగూడ, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులో సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ సోమవారం సికింద్రాబాద్ 10వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టుకు హాజరయ్యారు.
చిలకలగూడ పోలీసుల కథనం ప్రకారం.. గత శాసనసభ ఎన్నికల సందర్భంగా అప్పటి కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ నియోజకవర్గ అభ్యర్థి జయసుధ ఏప్రిల్ 2వ తేదీ రాత్రి 8.30కి నామాలగుండులో ఎన్నికల కోడ్‌ను అతిక్రమించి జెండాలు, టోపీలు పంపిణీ చేశారని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఎ.సురేష్ చిలకలగూడ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
కేసు విచారణకు రావడంతో సోమవారం న్యాయవాదులతో కలిసి జయసుధ కోర్టుకు హాజరయ్యారు. మేజిస్ట్రేట్ రాజన్న కేసును విచారించి, జూన్ 2వ తేదీకి వాయిదా వేశారు