ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత | Gold biscuits seized at Shamshabad Airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

Jun 24 2017 7:36 PM | Updated on Sep 5 2017 2:22 PM

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు 22 లక్షల విలువైన బంగారం బిస్కెట్లు సీజ్‌ చేశారు.

హైదరాబాద్‌: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలలో అక్రమంగా తీసుకు వస్తున్న బంగారం బయపటడింది. జెడ్డా నుంచి శనివారం సాయంత్రం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులను సోదా చేయగా వారి వద్ద రూ.22 లక్షల విలువ జేసే 747 గ్రాముల బంగారం బిస్కెట్లు దొరికాయి. ఇందుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవటంతో వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement