గోల్కొండ కోటలో స్విమ్మింగ్ పూల్ | GHMC to build swimming pool at golkonda fort | Sakshi
Sakshi News home page

గోల్కొండ కోటలో స్విమ్మింగ్ పూల్

Aug 21 2015 4:53 PM | Updated on Sep 3 2017 7:52 AM

గోల్కొండ కోటలో స్విమ్మింగ్ పూల్

గోల్కొండ కోటలో స్విమ్మింగ్ పూల్

గోల్కొండ కోటలో రూ. 1.25 కోట్ల వ్యయంతో స్విమ్మింగ్ పూల్ నిర్మించాలని జీహెచ్ఎంసీ నిర్ణయిచింది.

హైదరాబాద్: గోల్కొండ కోట సందర్శకులకు శుభవార్త. లోపలికి అడుగు పెట్టిన దగ్గర్నుంచి కోట పైకి ఎక్కి.. మళ్లీ దిగేవరకు ఆయాసం, చెమటలు అందరికీ అనుభవమే. అయితే ఇకపై ఈ బాధలన్నీ తీరిపోనున్నాయ్. పర్యాటకులు ఎంచక్కా గోల్కొండ కోటలోని స్విమ్మింగ్ పూల్ లో చల్లటి స్నానం చేసి బడలికను ఒదిలించుకోవచ్చు. ఇంతకీ ఆ ఈత కొలను ఎక్కడుందాంటారా..

కోటలోని షాహతిమ్ చెరువు లేదా కటోరా హౌస్ కుంటలను స్విమ్మింగ్ పూల్స్గా అభివృద్ధి చేయాలని  జీహెచ్ఎంసీ భావిస్తున్నది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ శుక్రవారం షాహతిమ్, కటోరా చెరువులను సందర్శించారు. ఈ రెండు చెరువుల్లో ఒకదానిని ఎంపిక చేసుకుని రూ. 1.25 కోట్ల వ్యయంతో స్విమ్మింగ్ పూల్ను నిర్మించనున్నట్లు సోమేశ్ చెప్పారు. తర్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. చారిత్రక గోల్కొండ కోటలోనే తెలంగాణ ప్రభుత్వం జెండా పండుగ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement