వైద్యానికి డబ్బులేక తండ్రీకొడుకుల ఆత్మహత్య | Father committed suicide due to the lack of money for medicine | Sakshi
Sakshi News home page

వైద్యానికి డబ్బులేక తండ్రీకొడుకుల ఆత్మహత్య

May 16 2016 1:48 AM | Updated on Nov 6 2018 7:56 PM

వైద్యానికి డబ్బులేక తండ్రీకొడుకుల ఆత్మహత్య - Sakshi

వైద్యానికి డబ్బులేక తండ్రీకొడుకుల ఆత్మహత్య

పేదరికం తండ్రీకొడుకులను బలిగొంది... ఆదివారం మీర్‌పేట ఠాణా పరిధిలోని బడంగ్‌పేట నగర పంచాయతీలో.....

మీర్‌పేట: పేదరికం తండ్రీకొడుకులను బలిగొంది... ఆదివారం మీర్‌పేట ఠాణా పరిధిలోని బడంగ్‌పేట నగర పంచాయతీలో గల శివనారాయణపురంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది.  ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం... పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన  వెంకటరమణ (52), భార్య ఉష, కుమారుడు సాయి చైతన్య (15)తో కలిసి శివనారాయణపురంలో స్థిరపడ్డాడు. భర్త వెంకటరమణకు జీవనోపాధికి ఎలాంటి మార్గం లేకపోవడంతో భార్య ఉష క్యాటరింగ్ పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ పరిస్థితుల్లోనే సాయి చైతన్య చదువుకు సైతం 5వ తరగతితో స్వస్తి చెప్పించి పౌరోహిత్యం నేర్పించారు.

వెంకటరమణ అనారోగ్యానికి గురి కావడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా... రూ. లక్ష ఖర్చు అవుతుందని చెప్పారు. అసలే కుటుంట పోషణ భారంగా మారిన సమయంలో వైద్యం చేయించుకొనే మార్గం లేక వెంకట రమణ తన కుమారుడితో కలిసి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యను పాల ప్యాకెట్ కోసం పంపి వెంకటరమణ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement