ఫేసియల్ యోగా రికార్డు బద్దలైంది | Facial yoga breaks Gunnies record | Sakshi
Sakshi News home page

ఫేసియల్ యోగా రికార్డు బద్దలైంది

Oct 11 2015 10:24 PM | Updated on Sep 3 2017 10:47 AM

ముఖంలో మెరుపులు పెంచేందుకు ఉపకరించే ఫేసియల్ యోగా... సిటీని మరో అంశంలో గిన్నిస్ రికార్డులకు ఎక్కించింది.

సాక్షి సిటీబ్యూరో: ముఖంలో మెరుపులు పెంచేందుకు ఉపకరించే ఫేసియల్ యోగా... సిటీని మరో అంశంలో గిన్నిస్ రికార్డులకు ఎక్కించింది. గ్లామర్ రంగ ప్రముఖురాలు రుచికాశర్మ... ఆధ్వర్యంలోని బీయింగ్ ఉమెన్ సంస్థ ఆదివారం ఉదయం నిర్వహించిన ఓ కార్యక్రమంలో వేల సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ శిబిరంలో ఫేసియల్ యోగా సాధన చేశారు. తద్వారా ఏకకాలంలో ఎక్కువ మంది మహిళలు పాల్గొన్న ఫేస్ యోగా ఈవెంట్‌గా గతంలో థాయ్‌ల్యాండ్ పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టామని రుచికాశర్మ చెప్పారు.

కార్యక్రమానికి హాజరైన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధిగా ఎలోనారా గ్రీనాక్ రికార్డ్ నమోదు ప్రతిని రుచికాశర్మకు అందజేశారు. వయసుతో పాటు వచ్చే ముఖవర్ఛస్సులో మార్పు చేర్పులను ఫేసియల్ యోగా సమర్ధవంతంగా నియంత్రించగలదని ఈ సందర్భంగా రుచికా శర్మ అన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement