విద్యుత్ ఉద్యోగుల విభజన అంశంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎండీల స్థాయి సమావేశం విఫలమైంది.
విద్యుత్ ఉద్యోగుల విభజనపై
ఇరు రాష్ట్రాల అధికారుల నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన అంశంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎండీల స్థాయి సమావేశం విఫలమైంది. తాడోపేడో ధర్మాధికారి కమిటీ ముందే తేల్చుకోవాలని రెండు రాష్ట్రాల అధికారులు నిర్ణయించుకున్నారు. హైకోర్టు ఆదేశంతో ఏర్పాటైన జస్టిస్ ధర్మాధికారి సూచన మేరకు రెండు రాష్ట్రాల ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల సీఎండీలు గురువారం భేటీ అయ్యారు. స్థానికతపై ఉమ్మడి మార్గదర్శకాల రూపకల్పనలో ఎవరికి వారే అన్నట్టు వ్యవహరించారు. ఇతర రాష్ట్రాల మాదిరి విభజన ప్రక్రియను అనుసరిద్దామని, దీనికి అంగీకరించని పక్షంలో కమల్‌నాథన్ మార్గదర్శకాల్లో వెళ్తామని ఏపీ అధికారులు సూచించారు. దీనికి తెలంగాణ సీఎండీలు ఎంతమాత్రం అంగీకరించలేదు. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల పంపకాలు చేయాలని తెలంగాణ అధికారులు ప్రతిపాదించారు. దీనితో ఏపీ అధికారులు విభేదించడంతో ప్రతిష్టంభన ఏర్పడింది.