
ఆలయంలోకి రావద్దు
దళితులను అవమాన పరిచేలా కొం దరు వ్యవహరిస్తున్న తీరు మెదక్ జిల్లా జిన్నారం మండలం మంబాపూర్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది.
జిన్నారం(మెదక్): దళితులను అవమాన పరిచేలా కొం దరు వ్యవహరిస్తున్న తీరు మెదక్ జిల్లా జిన్నారం మండలం మంబాపూర్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గ్రామంలో మూడు రోజుల నుంచి పెద్దమ్మ తల్లి విగ్రహావిష్కరణ ఉత్సవాలు జరుగుతున్నారుు. బుధవారం తమను కొందరు అగ్రకులస్తులు ఆలయంలోనికి రానివ్వలేదని దళితులు ఆరోపించారు. డప్పు వారుుస్తున్న సురేశ్‌పై గ్రామస్తులు అకారణంగా చేరుుచేసుకున్నారని చెప్పారు. ఉత్సవాలు పూర్తి అయ్యేవరకు ఆలయంలోకి రావద్దంటూ హుకుం జారీ చేశారన్నారు. సర్పంచ్ కుమారుడు, ఎంపీటీసీ భర్త ఈ వ్యవహారం వెనుక ఉన్నారని దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాన కార్యక్రమానికి కూడా రాని వ్వటం లేదని ఆవేదన చెందారు. ఈ విషయమై జిన్నారం పోలీసులకు దళితులు ఫిర్యా దు కూడా చేశారు. పోలీసులు, అధికారులు అగ్రకులస్తులకే మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు.
ఆలయ ప్రవేశాన్ని అడ్డుకోవడంతో దళితులు తమ కాలనీలో నిరసన చేపట్టారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తూప్రాన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎస్సై లాలునాయక్, రెవెన్యూ అధికారులు గ్రామంలో విచారణ జరిపారు. దళితులపై చేరుుచేసుకున్న వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. గ్రామంలో శాంతి వాతావరణం ఏర్పడేందుకు అందరూ సహకరించాలని డీఎస్పీ సూచించారు.