నయీమ్‌కు గోవాలోనూ ఓ బంగ్లా ఉన్నట్లు తెలిసింది. నయీమ్ ఏడాదిలో నెలకుపైగా అక్కడే ఉండి సెటిల్‌మెంట్లు
	హైదరాబాద్: నయీమ్‌కు గోవాలోనూ ఓ బంగ్లా ఉన్నట్లు తెలిసింది. నయీమ్ ఏడాదిలో నెలకుపైగా అక్కడే ఉండి సెటిల్‌మెంట్లు నిర్వహించేవాడని తెలిసింది. తాను టార్గెట్ పెట్టుకున్న వ్యక్తుల్ని అక్కడికి తీసుకెళ్లి బెదిరించి భూములు, ఆస్తులు విక్రయించినట్టు సంతకాలు తీసుకునేవాడని పోలీసులు అనుమానిస్తున్నా రు.
	
	రాజేంద్రనగర్ ఏసీపీ ఆధ్వర్యంలో ఓ  బృందం గోవాలోని బంగ్లాకు వెళ్లింది. అక్కడి పనిమనిషి ఖాజా ఉద్దీన్‌ను బుధవారం అదుపులోకి తీసుకుంది. బొలేరోతో పాటు రూ. 4.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించగా.. నయీమ్ వద్ద రూ.50 వేల అప్పు తీసుకున్నందుకు తనను పనిమనిషిగా పెట్టుకున్నాడని పోలీసులకు చెప్పినట్టు సమాచారం. 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
