‘గజల్‌ను సామాజికంగా బహిష్కరించాలి’ | cultural organizations, artists fires on ghazal srinivas | Sakshi
Sakshi News home page

‘గజల్‌ను సామాజికంగా బహిష్కరించాలి’

Jan 6 2018 12:03 PM | Updated on Sep 4 2018 5:32 PM

cultural organizations, artists fires on ghazal srinivas - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌ రాసలీలల వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గజల్‌ రాసలీలలకు సంబంధించిన వీడియోలను బాధితురాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆయనపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాల కళాసంస్థలు, కళాకారులు ధ్వజమెత్తారు.  ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన గజల్‌ శ్రీనివాస్‌ను కఠినంగా శిక్షించి, అతడిని సామాజికంగా బహిష్కరించాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల కళాసంస్థలు, కళాకారులు అన్నారు. 

శుక్రవారం హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో విలేకరుల సమావేశం ఆనందలహరి సాంస్కృతిక సంస్థ రాష్ట్ర కన్వీనర్‌ మల్లం రమేష​ మాట్లాడుతూ.. గజల్‌ శ్రీనివాస్‌ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ కళారంగాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి కంటూ సాయన్న, చల్లా సరోజినీదేవి, సీనియర్‌ నటి ఆనందలక్ష్మి, రామడుగు వాసంతి, మోహన్కుమార్‌ గాంధీ, మిమిక్రి కళాకారులు రాంబాబు, జానపద నాయకులు బాలస్వామి, సాయబాబా పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement