టీఆర్‌ఎస్‌ బలహీనపడింది | Congress comments on TRS | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ బలహీనపడింది

Feb 14 2017 1:49 AM | Updated on Sep 19 2019 8:44 PM

టీఆర్‌ఎస్‌ బలహీనపడింది - Sakshi

టీఆర్‌ఎస్‌ బలహీనపడింది

టీఆర్‌ఎస్‌కు ఆయువు పట్టుగా ఉన్న ఉత్తర తెలంగాణలోనే బలహీన పడిందని, అన్నివర్గాలకూ ఆ పార్టీపై భ్రమలు తొలగిపోతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ఉత్తమ్‌
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు 55 స్థానాలు


సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌కు ఆయువు పట్టుగా ఉన్న ఉత్తర తెలంగాణలోనే బలహీన పడిందని, అన్నివర్గాలకూ ఆ పార్టీపై భ్రమలు తొలగిపోతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఏఐసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ కొప్పుల రాజు, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షు డు పొన్నాల లక్ష్మయ్య, శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీ, ఏఐసీసీ ప్రతినిధి కె.వి.కృష్ణమూర్తి తదితర ముఖ్యనేతలు హాజ రయ్యారు.

ఉత్తమ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో రాజకీ య పరిస్థితులు, బలాబలాలపై సర్వే చేయిం చినట్టు చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 119 స్థానాల్లో కాంగ్రెస్‌ కనీసం 55 గెలిచే అవకాశాలున్నట్టు తేలిందన్నారు. ఆశ్చర్యకరంగా ఉత్తర తెలంగాణలోని చాలా నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, సీఎం కేసీఆర్‌పై తీవ్ర అసంతృప్తి కనిపించింద న్నారు. అయితే 25నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ బలహీనంగా ఉందని, ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే మెరుగైన ఫలితాలొస్తాయన్నారు.  

క్షేత్రస్థాయిలో ఎండగడతాం..
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభు త్వాల వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగ డతామని ఉత్తమ్‌ చెప్పారు. ఈ నెల 19 నుంచి 28 దాకా నియోజకవర్గ స్థాయిలో జన ఆవేదన సమ్మేళనాలను నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రం లో సీఎం కేసీఆర్‌ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. అధికారంలోకి వస్తే ఏటా 2కోట్ల ఉద్యోగాలిస్తామన్న మోదీ.. ఈ రెండున్నరేళ్లలో 77వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన వన రులను కూడా కేంద్రం ఇవ్వడంలేదన్నారు.

ఖాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ, హైకోర్టు విభజన, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, ఐటీఐఆర్‌ వంటి హామీలన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్క డే అన్నట్టుగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోయిందన్నారు. కేసీఆర్‌ మాట్లాడు తున్నా, కొత్తగా హామీలిస్తున్నా ప్రజలు నవ్వు కుంటున్నారన్నారు. తెలంగాణ కోసం పోరా డిన అన్నివర్గాలను కేసీఆర్‌ మోసం చేశార న్నారు. ఈ నెల 19న నిజామాబాద్‌లో జన ఆవేదన సభ జరుగుతుందన్నారు. ప్రతీరోజు పాత జిల్లాలోని పది నియోజకవర్గాల చొప్పున ఈ సభలు జరుగుతాయని ఉత్తమ్‌ వెల్లడించారు. పార్టీ నేతలు బలరాంనాయక్, డి.కె.అరుణ, సబితా ఇంద్రారెడ్డి, మల్లు రవి, వినోద్‌రెడ్డి  పాల్గొన్నారు.  

భవిష్యత్తులోనూ ‘కెప్టెనే’...  
వచ్చే ఎన్నికలను కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోనే ఎదుర్కోవాల్సి ఉంటుందని ఏఐసీసీ నేతలు సంకేతాలిచ్చారు. టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ఏఐసీసీ నేతలు కొప్పుల రాజు, కె.బి.కృష్ణమూర్తి మాట్లాడుతున్న సమయంలో... వచ్చే ఎన్నికల్లో పార్టీ ఎవరి నాయకత్వంలో పోరాడుతుంతో స్పష్టత ఇవ్వాలని ఒకరిద్దరు నేతలు కోరినట్టుగా తెలిసింది. దీనికి సమాధానంగా ఏఐసీసీ నేతలు మాట్లాడుతూ ‘ఇప్పుడున్న కెప్టెనే వచ్చే ఎన్నికల్లోనూ కెప్టెన్‌గా ఉంటారు. ఈ విషయంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా స్పష్టంగానే ఉన్నారు’ అని స్పష్టం చేశారు.

అనుబంధ సంఘాలే బలమైన పునాది
కొప్పుల రాజు
కాంగ్రెస్‌పార్టీ అను బంధ సంఘాలను గ్రామ స్థాయినుంచి నిర్మాణం చేసుకోవా లని, పార్టీకి క్షేత్ర స్థాయిలో ఇవే బలమైన పునాదులు అవు తాయని ఏఐసీసీ ఎస్సీసెల్‌ చైర్మన్‌ కొప్పుల రాజు అన్నారు. సోమవారం ఇందిరా భవన్‌లో టీపీసీసీ అనుబంధ సం ఘాల సమావేశం జరిగింది. ఆయన మాట్లా డుతూ, అనుబంధ సంఘాలకు గ్రామ స్థాయి నుంచి కమిటీలను ఏర్పాటు చేయా లని, దీనివల్ల పార్టీకి సంపూర్ణ బలం చేకూ రుతుందన్నారు.

ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌  ఇచ్చిన హామీలపై అనుంబంధ సంఘాల ద్వారా గ్రామ స్థాయిలో పోరాటాలు చేయా లని కొప్పుల సూచించారు. ఇందులో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళలు, విద్యార్థులు, యువకులు, రైతు లకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలేమిటో గుర్తిం చి, వాటి అమలులోని వైఫల్యాలపై పోరా టాలకు ప్రణాళికలు రూపొందిం చాలని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement