‘ట్రిపుల్‌’పై కేకేతో ముస్లిం లా బోర్డు ప్రతినిధుల భేటీ

Conference of Muslim Law Board Representatives with KK on Triple talaq - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై ఎంపీ కె.కేశవరావును ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సభ్యులు, ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రీ తదితరులు మంగళవారం కలిశారు. ఈ మేరకు కేకే నివాసంలో బిల్లుపై కాసేపు చర్చించారు. ఇప్పటికే లోక్‌సభలో నెగ్గిన ట్రిపుల్‌ తలాక్‌ బిల్లులోని పలు అంశాలపై తమకు వ్యతిరేకత ఉందని లా బోర్డు సభ్యులు వెల్లడించారు. తమ అభ్యంతరాలను కేకేకు వివరించారు.

రాజ్యసభలో బిల్లు చర్చకు వచ్చినప్పుడు వీటిపై మాట్లాడాలని కోరారు. అయితే దీనిపై కేకే ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిసింది. ఈ సమావేశంపై కేకే ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే లోక్‌సభలో అనుసరించినట్టుగానే ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు చర్చకు వచ్చినప్పుడు వాకౌట్‌ చేయాలనే యోచనతో ఉన్నట్టుగా తెలిసింది. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top