
ఖాతాలలో నగదు మాయం:స్పందించని సిండికేట్ బ్యాంకు
సికింద్రాబాద్ పికెట్ సిండికేట్ బ్యాంకు బ్రాంచ్లో ఖాతాదారులు దాచుకున్న డబ్బు మాయం అయింది.
హైదరాబాద్: సికింద్రాబాద్ పికెట్ సిండికేట్ బ్యాంకు బ్రాంచ్లో ఖాతాదారులు దాచుకున్న డబ్బు మాయం అయింది. మొత్తం 22 మంది ఖాతాదారులకు చెందిన 10 లక్షల 73వేల రూపాయలు మాయం అయ్యాయి. తాము దాచుకున్న డబ్బు తమకు ఇవ్వాలని వారం రోజుల నుంచి బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. బ్యాంకు యాజమాన్యం నుంచి స్పందనలేదు.
ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ధర్నా చేశారు. జరిగిన మోసానికి తమకేలాంటి సంబంధంలేదని బ్యాంకు యాజమాన్యం చెబుతోంది.