
ఔటర్ రింగ్ రోడ్డులో కారు దగ్ధం
హైదరాబాద్ నగరం ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులో నుంచి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.
ఘట్‌కేసర్: హైదరాబాద్ నగరం ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులో నుంచి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ సంఘటన ఆదివారం రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం సమీపంలోని ఔటర్‌రింగ్ రోడ్డుపై జరిగింది. ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్ కారును వెంటనే నిలిపివేశారు.
ఆ సమయంలో కారులో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి ఉన్నారు. మంటలు దావానంలా వ్యాపించడంతో కారు చూస్తుండగానే పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలిసిన ఘట్‌కేసర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.