ధర్నాచౌక్ రాష్ట్ర ప్రజల ప్రాథమిక హక్కు దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు.
ధర్నాచౌక్ ప్రజల ప్రాథమిక హక్కు: లక్ష్మణ్
May 15 2017 1:15 PM | Updated on Sep 5 2017 11:13 AM
హైదరాబాద్: ధర్నాచౌక్ రాష్ట్ర ప్రజల ప్రాథమిక హక్కు దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ధర్నాచౌక్ వద్ద జరిగిన ఘటనలపై ఆయన స్పందిస్తూ.. స్థానికంగా ఉన్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా పరిమితితో కూడిన ధర్నా చౌక్‌ను కొనసాగించాలి. ప్రత్యామ్నాయ మార్గం చూయించాలి. ధర్నాచౌక్ అంశాన్ని అధికార పార్టీ రాజకీయం చేస్తోంది. తెలంగాణ కొరకు అనేక ఆందోళనలు, ఉద్యమాలు చేసిన అనుభవం ప్రజలకు ఉందని అన్నారు.
Advertisement
Advertisement