ఐఓఎస్‌లోనూ ‘హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్’ | Available from today: Jitender | Sakshi
Sakshi News home page

ఐఓఎస్‌లోనూ ‘హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్’

Mar 4 2016 12:21 AM | Updated on Sep 3 2017 6:55 PM

నగర ట్రాఫిక్ విభాగం అధికారులు రూపొందించిన సిటిజన్ ఫ్రెండ్లీ మెబైల్ యాప్

నేటి నుంచి అందుబాటులోకి: జితేందర్
 
సిటీబ్యూరో: నగర ట్రాఫిక్ విభాగం అధికారులు రూపొందించిన సిటిజన్ ఫ్రెండ్లీ మెబైల్ యాప్ (HYDERABADTRAFFIC LIVE) ఐఓఎస్ పరిజ్ఞానంలోనూ అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం నుంచి యాపిల్ ఐ స్టోర్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ట్రాఫిక్ చీఫ్ జితేందర్ గురువారం తెలిపారు. ఈ యాప్‌ను ఆవిష్కరించినప్పుడు కేవలం ఆండ్రాయిన్ పరిజ్ఞానంతో పని చేసే ఫోన్లకు మాత్రమే ఉపకరించేలా రూపొందించారని,. ప్రస్తుతం ఐఓఎస్ పరిజ్ఞానంతో పని చేసే ఐఫోన్ వినియోగదారులకూ అనుగుణంగా అభివృద్ధి చేశారు. జీపీఎస్ ఆధారంగా పని చేసే ఈ యాప్‌లో తొమ్మిది రకాలైన సమాచారం, సేవలు అందబాటులో ఉంటాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, నేరాలతో పాటు పోలీసులు చేసే ఉల్లంఘనలు, సూచనల్ని ఇందులో ఫీడ్ చేయవచ్చు. ఓ ప్రాంతం నుంచి  మరో ప్రాంతానికి ఆటో చార్జీ ఎంత ఉంటుందనేదీ తెలుసుకోవచ్చు. వివిధ మార్గాల్లో ఉన్న ట్రాఫిక్ సరళి గరిష్టంగా ఓ నిమిషం ఆలస్యంగా ఇందులో అప్‌డేట్ అవుతూ ఉంటుంది. ట్రాఫిక్ రద్దీని చెప్పడంతో పాటు సమీపంలో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను సైతం ఇది సూచిస్తుంది. గమ్య స్థానం దూరం, మ్యాప్స్ సైతం కనిపిస్తాయి.

 ఓ వ్యక్తి తాను ఉన్న ప్రాంతం నుంచి సమీపంలో ఉన్న శాంతిభద్రతల విభాగం, ట్రాఫిక్ పోలీసుస్టేషన్లను తెలుసుకోవడానికి, మీ వాహనంపై ఉన్న పెండింగ్ ఈ-చలాన్లు తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది. దీని ద్వారానే మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లకు కనెక్ట్ అవడంతో పాటు బకాయి మొత్తాన్ని అప్పటికప్పుడే చెల్లించే సౌకర్యమూ ఉంది. నో పార్కింగ్‌లో ఉంచిన వాహనాలను పోలీసులు క్రేన్ ద్వారా ఎత్తుకెళితే (టోవింగ్) ఆ విషయాన్నీ ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆర్టీఏ వివరాలు, ఆటో, బస్సు, క్యాబ్, ట్యాక్సీ తదితర వాహనాలకు సంబంధించిన ఫిర్యాదులు, రహదారి నిబంధనలు, ఉపయుక్తమైన వెబ్‌సైట్లు, రోడ్ సైన్స్, ట్రాఫిక్ పోలీసు అధికారుల సమాచారం ఇందులో లభిస్తాయి.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement