విజయ్ ని కోర్టులో హాజరుపరచాలి: వరవరరావు | vijay should be Produce in court | Sakshi
Sakshi News home page

విజయ్ ని కోర్టులో హాజరుపరచాలి: వరవరరావు

Nov 19 2015 9:19 AM | Updated on Sep 3 2017 12:43 PM

పోలీసులు అదుపులోకి తీసుకున్న ఉస్మానియా ఎంటెక్ విద్యార్థి మనువాడ విజయ్ ని వెంటనే కోర్టులో హాజరు పరచాలని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు డిమాండ్ చేశారు.

వరంగల్  కేసీఆర్ సభలో నిరసన తెలిపిన ఉస్మానియా ఎంటెక్ విద్యార్థి మనువాడ విజయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రజా సంఘాలు తెలిపాయి. విజయ్ తో పాటు అతని తల్లి దండ్రులు కూడా పోలీసులు పట్టుకెళ్లారని.. పేర్కొన్నారు. వెంటనే విజయ్, అతడి తల్లి దండ్రులను పోలీసులు కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేశారు.  కాగా.. విజయ్ కి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు వాదిస్తున్నారు. మరో వైపు కేసీఆర్ సభలో నిరసన తెలిపి నందుకే పోలీసులు విజయ్ పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.

పోలీసులు అదుపులోకి తీసుకున్న ఉస్మానియా ఎంటెక్ విద్యార్థి మనువాడ విజయ్ ని వెంటనే కోర్టులో హాజరు పరచాలని విప్లవ రచయితలసంఘం నేత వరవరరావు డిమాండ్ చేశారు. కొత్తగూడెం పోలీసులు మనువాడ విజయ్ ని అదుపులోకి తీసుకున్నారని ఆయన తెలిపారు. అక్రమంగా తమ కస్టడీలో పెట్టుకున్న మనువాడ విజయ్ ని పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement