నడిరోడ్డుపైనే ప్రసవం


విజయవాడ: ఓ నిండు గర్భిణి ప్రసవం కోసం ఆస్పత్రికి వెళుతూ.. నడిరోడ్డుపైనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. విజయవాడ నగరంలోని చిట్టినగర్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామన ఈ ఘటన జరిగింది. చిట్టినగర్ సొరంగ మార్గం సమీపంలో నివసించే షేక్‌ గౌసియా (21) అనే మహిళకు పురుటి నొప్పులు మొదలుకావడంతో తల్లితో కలసి సోమవారం తెల్లవారుజామున ఆస్పత్రికి బయల్దేరింది..అయితే రోడ్డుపై నడచి వెళుతుండగానే నొప్పులు అధికం కావడంతో అక్కడికక్కడే కూలబడిపోయింది. ఇది గమనించిన స్థానిక మహిళలు సాయం అందించేందుకు సిద్ధమయ్యారు. ఇంట్లో ఉన్న చీరలు తెచ్చి గౌసియా చుట్టూ అడ్డంగా పెట్టాంరు. నొప్పుల బాధపడుతున్న ఆమెను ఓదార్చారు. ఓ అరగంట వేదన అనంతరం గౌసియా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండటంతో అందరికళ్ల వెంబడి ఆనందభాష్పాలు రాలాయి. ఆ తరువాత 108 ఆంబులెన్స్కు సమాచారం అందించారు. ప్రస్తుతం గౌసియా, ఆమె కొడుకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నారు.
 

Read also in:
Back to Top