ఎక్సైజ్ ఏసీ ఆదిశేషుపై సస్పెన్షన్ వేటు | exise AC adisheshu hasbeen suspended | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్ ఏసీ ఆదిశేషుపై సస్పెన్షన్ వేటు

Jan 27 2016 6:58 PM | Updated on Aug 18 2018 6:00 PM

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎం.ఆదిశేషును ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎం.ఆదిశేషును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈమేరకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయల కల్లాం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మద్యం డిపోలో చీఫ్ మేనేజరుగా పనిచేస్తున్న ఆదిశేషుపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు ఆయన కార్యాలయం, ఇళ్లపై దాడులుచేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 20న అరెస్టయిన ఆదిశేషుకు  కోర్టు ఫిబ్రవరి 4 వరకు ఆదిశేషుకు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఆదిశేషు వద్ద సుమారు 100 కోట్ల అక్రమసంపాదన పోగుపడినట్లు ఏసీబీ ఆరోపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement