విజయవాడలో వైసీపీ కార్పోరేటర్ల ఆందోళన

YSRCP Corporators Worry About Suspension - Sakshi

సాక్షి, విజయవాడ: వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్పోరేటర్లను సస్పెండ్‌ చేయటాన్ని నిరసిస్తూ కౌన్సిల్‌ హాల్‌ బయట వైసీపీ కార్పోరేటర్లు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కార్పోరేటర్ల ఆందోళనకు వైసీపీ నేతలు వెల్లం పల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణు, యలమంచిలి రవి, తదితరులు మద్దతు పలికారు. 

గురువారం ఉదయం నుంచి వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు షేక్‌ బీజన్‌ బీ, జమల పూర్ణమ్మలు సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా మున్సిపల్ హాల్‌లో దీక్ష చేపట్టారు. వీరికి వైస్సార్‌సీపీ కార్పోరేటర్లు, నాయకులు మద్దతుగా నిలిచారు. తమకు మేయర్ క్షమాపణ చెప్పే వరకు దీక్ష కొనసాగిస్తామని తెలిపారు. హోదాపై చంద్రబాబు తప్పులను మున్సిపల్ కార్పొరేషన్ సాక్షిగా ఎత్తి చూపుతామనే భయంతోనే మమ్మలను సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. హోదాకు వెన్నుపోటు పొడిచిన టీడీపీనే, నేడు కౌన్సిల్‌లో ఏకగ్రీవ తీర్మానం చేస్తామంటే ఎవరు నమ్ముతారని, తీర్మానం చేసే ముందు హోదాపై మున్సిపల్ కౌన్సిల్ లో సుదీర్ఘంగా చర్చ జరగాలని, చర్చ జరిగితేనే హోదా కు ఎవరు వెన్నుపోటు పొడిచారో ప్రజలకు తెలుస్తుందని తెలిపారు. నాలుగు సంవత్సరాల పాటు హోదాను ఏనాడు పట్టించుకోని చంద్రబాబు, నేడు హోదా గురించి మాట్లాడడం ప్రజలను మోసాగించడం కాదా అని ప్రశ్నించారు.  రాజకీయ ప్రయోజనాలను ఆశించి.. హోదా కోసం పోరాటం చేసిన వైస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టించిన బాబు ఇప్పుడు హోదా కోసం మాట్లాడడం ఏమిటన్నారు. హోదాపై అనేక సార్లు యూ టర్న్ తీసుకున్న బాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top