నగరంలోని బహదూర్‌పురాలో డీసీఎం లారీ ఢీకొని ఓ అంగన్ వాడీ స్కూల్ టీచర్ ప్రాణాలు కోల్పోయింది.
నగరంలోని బహదూర్‌పురాలో డీసీఎం లారీ ఢీకొని ఓ అంగన్ వాడీ స్కూల్ టీచర్ ప్రాణాలు కోల్పోయింది. చింతల్‌మెట్‌లో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్న వి.వి.రమణి బహదూర్‌పురాలో ఆర్టీసీ బస్సు కోసం వేచి చూస్తోంది. అదే సమయంలో అటువైపు వచ్చిన డీసీఎం ఢీకొనడంతో తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.