మన్యం వీరుడు

మన్యం వీరుడు - Sakshi


కొత్త సీరియల్‌ ప్రారంభం



భారతీయ గిరిజన పోరాటాలలో సుదీర్ఘమైనది విశాఖ మన్య పోరాటం. అంతేనా!1920 దశకంలో మద్రాసు ప్రెసిడెన్సీని కకావికలం చేసిన ఘట్టాలు రెండు– ఒకటి మోప్లా తిరుగుబాటు. రెండోదే మన మన్య పోరాటమని చరిత్రకారులు నిర్ధారించారు, తెలుసా?మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాడి వచ్చిన బలగాలతో దీనిని అణచివేశారనీ, మద్రాసుతో పాటు బొంబాయి, కలకత్తా ప్రెసిడెన్సీలు కూడా సహకరించాయనీ ఎందరికెరుక?చరిత్రలో మొదటి నకిలీ ఎన్‌కౌంటర్‌ రామరాజుదేనన్న వాస్తవం గుర్తించడానికి ఇంకెంత కాలం కావాలి? అండమాన్‌ జైలు గోడల మీద మన్యవీరుల పేర్లున్న సంగతి గర్వకారణమా, కాదా! ఈ ఉద్యమాన్ని అణచడానికి పాతిక నుంచి నలభై లక్షల ఖర్చయిందని మద్రాస్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ చర్చలో ప్రస్తావనకు వచ్చిన సంగతి ఎందరికి తెలుసు? ఆ చర్చలో సీఆర్‌ రెడ్డి ఏం కోరారు? అంతకు మునుపే రామరాజును ప్రకాశం ఏమన్నారు? 



గోచి పాతరాయుళ్లయిన విశాఖ గిరిజనులకీ; మలబార్‌ పోలీస్‌–అస్సాం రైఫిల్స్‌– స్థానిక పోలీసుల సమైక్య బలగాలకీ నడుమ 60కిపైగా ఎన్‌కౌంటర్లు జరిగాయంటే అదెంత భీకర పోరో అంచనా వేయగలమా! శ్రీరామరాజు ఎలా దొరికాడు? బ్రిటిష్‌ బలగాల సామర్థ్యంతోనా? వాళ్ల కుట్రతోనా? లేక, అడవి మీద ప్రేమతోనా? అడవి బిడ్డల కష్టం చూడలేకా? ఇంకా ఎన్నో ప్రశ్నలు... ఎన్నెన్నో వాస్తవాలు.... ఎన్నెన్నో చీకటికోణాలు.వీటితో మీ ముందుకు ధారావాహికగా వస్తోంది–ఈ సంచిక నుంచే. ఆకుపచ్చ సూర్యోదయం మన్యవీరుడు అల్లూరి గాథ

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top