తిరుమల యాత్ర.. సులభతరం ఇలా... | Now Tirumala Tour easy | Sakshi
Sakshi News home page

తిరుమల యాత్ర.. సులభతరం ఇలా...

Oct 6 2013 2:38 AM | Updated on Nov 9 2018 6:29 PM

తిరుమల యాత్ర.. సులభతరం ఇలా... - Sakshi

తిరుమల యాత్ర.. సులభతరం ఇలా...

శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు దేవస్థానం అన్ని రకాల మౌలిక సదుపాయాలనూ కల్పిస్తోంది. అయితే... బస సౌకర్యాలు ఎన్ని రకాలు? వాటిని ఏ విధంగా పొందాలి? ఏయే రకాల దర్శనాలు ఉన్నాయి?

శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే  భక్తులకు దేవస్థానం అన్ని రకాల మౌలిక  సదుపాయాలనూ కల్పిస్తోంది. అయితే... బస సౌకర్యాలు ఎన్ని రకాలు? వాటిని ఏ విధంగా పొందాలి? ఏయే రకాల దర్శనాలు ఉన్నాయి? వాటి వేళలు, నిత్య, వార, వార్షిక ఆర్జితసేవలు ఎలా పొందాలి? టీటీడీ ఈ -దర్శన్ కేంద్రాల ద్వారా గదులు, దర్శనం, ఆర్జిత సేవలు ఎలా ముందుగానే రిజర్వు చేసుకోవచ్చు... వంటి సమాచారం సరిగా తెలియక దళారుల చేతిలో మోసపోకుండా మీకోసం...  


 గదులు సులువుగా పొందడమెలా..!
 శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చే భక్తుల కోసం అన్ని ప్రాంతాల్లో మొత్తం 6626 గదులు అందుబాటులో ఉన్నాయి.  (సీఆర్‌వో/కేంద్రీయ విచారణ కార్యాలయం)లో 5428 గదులు భక్తులకు కేటాయిస్తారు. ఇందులో మొత్తం 200 ఉచిత గదులు. రూ.50 అద్దెగదులు 2083, రూ.100 అద్దెగదులు 2176, రూ.500 అద్దె గదులు 576, రూ.600 అద్దెగదులు 333, రూ.750 అద్దె గదులు 60 ఉన్నాయి. ఎటువంటి సిఫారసులు లేకుండా భక్తులే నేరుగా గదులు పొందవచ్చు. అన్ని రిసెప్షన్ కేంద్రాలు 24 గంటలూ పనిచేస్తాయి. భక్తులు నేరుగా క్యూలైన్లలో వేచి ఉండి గదులు పొందవచ్చు. ప్రజాప్రతినిధి, ఇతర ప్రముఖుల సిఫారసుల లేఖలతోనూ, ఇంటర్‌నెట్ ద్వారా కూడా గదులు పొందవచ్చు. ఆయా తరగతుల భక్తులకు టీటీడీ రిసెప్షన్ విభాగం వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరుగా కౌంటర్లు సిద్ధ్దం చేసింది.

సమాచారం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్: 0877- 2263572
 సిఫారసు లేఖలపై: సీఆర్‌వోలోని టీబీ కౌంటర్‌కు 600 గదులను కేటాయిస్తారు. ఇందులో ఎమ్మెల్యే, ఎంపీ, టీటీడీ బోర్డు సభ్యులు, ఇతర ప్రభుత్వ అధికారుల సిఫారసు లేఖలపై గదులు కేటాయిస్తారు.  సమాచారం కోసం సంప్రదించాల్సిన నంబర్: 0877-2263518.
 
 10 రోజుల ముందస్తు సమాచారంతో వచ్చే దాతలకు: సీఆర్‌వో కార్యాలయంలోని దాతల విభాగంలో 10 రోజుల ముందు బుక్ చేసుకున్న దాతలు తమ పాస్‌బుక్ ద్వారా గదులను ఉచితంగానే పొందవచ్చు. సమాచారం కోసం 0877-2263472 సంప్రదించవచ్చు.
 
 ప్రముఖుల కోసం:  పద్మావతి విచారణ కార్యాలయంలో ప్రముఖుల కోసం  620 గదులు ఉన్నాయి. ప్రముఖులు, టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు, అధికారుల సిఫారసు లేఖలకు గదులను కేటాయిస్తారు. భక్తులు తమ వద్దనున్న ప్రభుత్వ గుర్తింపు కార్డులు చూపి కూడా గదులను పొందే సౌకర్యం ఉంది. ఫోన్ నం: 0877-2263731


 సిఫారసు లేకుండానే: పద్మావతి  కార్యాలయంలో ఇటీవల ఎవరి సిఫారసు లేకుండానే భక్తులు నేరుగా గదులు పొందేలా అధికారులు కియాస్క్(రామ్స్) యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో రూ. 500 నుంచి రూ.6వేల వరకు అద్దె కలిగిన సన్నిధానం, శ్రీచక్ర, ఆదిశేషు, శంకుమిట్ట అతిథిగృహాల్లోని 400 గదులను పొందుపరిచారు. కియాస్క్ యంత్రంలో భక్తుడు తమ వ్యక్తిగత వివరాలు, పాన్‌కార్డ్, ఆధార్‌కార్డ్, డ్రైవింగ్ లెసైన్స్, పాస్‌పోర్టు వంటి తొమ్మిది ప్రభుత్వ గుర్తింపు కార్డులోని ఏదైనా ఒక నిర్దేశించిన నెంబరును నమోదు చేసుకుని సులభంగా గదిని పొందవచ్చు.
 
 సామాన్య భక్తులు, గదుల కొరతను దృష్టిలో ఉంచుకుని టీటీడీ తిరుమలలో నాలుగు యాత్రికుల వసతి సముదాయాలు(పీఏసీ) నిర్మించింది. నాలుగు పీఏసీలోని 23 హాళ్లల్లో మొత్తం 5806 లాకర్లు భక్తులకు ఉచితంగా కేటాయిస్తారు. ఈ సముదాయాల్లో సుమారు 20 వేల మంది భక్తులకు సరిపడా మరుగుదొడ్లు, స్నానాల గదులు, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. వసతిసముదాయం-2లో తలనీలాలు సమర్పించుకునేందుకు కల్యాణకట్ట సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
 
 వివిధ మార్గాల్లో శ్రీవారి దర్శనం
 శ్రీవారి దర్శనానికి భక్తులు వివిధ మార్గాల్లో వెళతారు. ప్రధానంగా సర్వదర్శనం (ధర్మదర్శనం), అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాటల్లో నడిచివచ్చిన భక్తులకు  ఉచిత దివ్యదర్శనం  దర్శనం, రూ.300 టికెట్ల దర్శనం, అడ్వాన్స్ బుకింగ్‌లో కేటాయించే రూ.50 సుదర్శనం టికెట్ల దర్శనం, అడ్వాన్స్ బుకింగ్‌లో కేటాయించే ఆర్జిత సేవలు, తిరుమలలో విజయబ్యాంకులో ముందు రోజు ఇచ్చే ఆర్జిత సేవల దర్శనం, పొర్లుదండాల (అంగప్రదక్షిణ) దర్శనం, ప్రముఖుల సిఫారసు లేఖలపై ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవల దర్శనాలు ఉన్నాయి. ఇక ఇంటర్‌నెట్ ద్వారా ఆర్జిత సేవలు పొందే సౌకర్యాన్ని టీటీడీ కల్పించింది.  
 
 సబ్సిడీపై మైకుసెట్లు, విగ్రహాలు, గొడుగులు, శేషవస్త్రాలు..!
 హిందూ ధర్మప్రచారంలో భాగంగా రాష్ట్రంలోని ఇతర ఆలయాలకు మైకుసెట్లు, రాతి విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు, ఉత్సవాల్లో వినియోగించే గొడుగులు, శేషవస్త్రాలు టీటీడీ సమకూర్చుతోంది. కొన్ని ఉచితంగాను, మరికొన్ని సబ్సిడీ ధరలపై భక్తులకు కేటాయిస్తోంది. టీటీడీ నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలు, దరఖాస్తులు సమర్పించి వీటిని పొందవచ్చు.  
 
 ఇంటర్‌నెట్, ఈ-దర్శన్‌కేంద్రాల్లో
 నిత్య ఆర్జిత సేవల కోటా
 ఆర్జితసేవ           ఇంటర్‌నెట్    ఈ-దర్శన్
 సుప్రభాతం                50     50
 తోమాల                  10      -
 అర్చన                      10    -
 వసంతోత్సవం        50    120
 కల్యాణోత్సవం        150    100
 ఊంజల్‌సేవ        -    50
 ఆర్జిత బ్రహ్మోత్సవం        25    60
 సహస్రదీపాలంకరణ సేవ        -    125
 నిజపాద దర్శనం        100    200
 విశేష పూజ        125    125
 అష్టదళపాద పద్మారాధన        20    40
 
 శ్రీవారినిత్య సేవలు - హాజరు సమయం
 సేవలు               సమయం  ధర      వ్యక్తులు
 సుప్రభాతం        02.00     120    1
 తోమాల సేవ        03.00    220    1
 (మంగళ/బుధ/గురు)
 అర్చన        03.30    220    1
 (మంగళ/బుధ/గురు)
 కల్యాణోత్సవం        10.00    1000    2
 ఆర్జిత బ్రహ్మోత్సవం        12.30    200    1
 డోలోత్సవం(ఊంజల్‌సేవ)    11.00    200    1
 వసంతోత్సవం    13.30    300    1
 సహస్రదీపాలంకరణ    17.00    200    1
 ఏకాంత సేవ (టికెట్లు అనుమతించరు)
 
 వారపు ప్రత్యేక సేవలు
 వారం        హాజరు సమయం  ధర       వ్యక్తులు
 సోమవారం - విశేషపూజ    
     05.00     600    1
 మంగళవారం - అష్టదళ పాదపద్మారాధన సేవ
     05.30    1250    1
 బుధవారం - సహస్ర కలశాభిషేకం
         05.30    850    1
 గురువారం - తిరుప్పావడసేవ
     05.30    850    1
 శుక్రవారం - వస్త్రాలంకార సేవ
     03.00    12,250    2
 శుక్రవారం - పూరాభిషేకం
     03.00    750    1
 
 కమిషనర్ వారి అనుమతి, ఆలయ ఫొటో, దరఖాస్తు చేసుకున్నవారి ఫొటో ధృవీకరణ పత్రం, ఆలయ నమూనా (ప్లాను), తహసీల్దార్ నుంచి అనుమతి పత్రం సమర్పించాలి.


 దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం, కేటీ రోడ్డు, తిరుపతి, అదనపు సమాచారం కోసం జనరల్ విభాగం ఏఈవో ఫోన్ నెంబరు 0877- 2264100కు సంప్రదించవచ్చు.
 
 కాలినడకనవచ్చే భక్తులకోసం...
 తిరుపతిలోని అలిపిరి మీదుగా కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు గాలిగోపురం వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద ఫొటోమెట్రిక్ విధానంలో భక్తుల ఫొటోలు, వేలిముద్రలు తీసుకుని టికెట్లు ఇస్తారు. అలాగే, శ్రీవారి మెట్టుమార్గంలోనూ వచ్చే భక్తులకు మార్గమధ్యంలో టికెట్లు అందజేస్తారు. వీరికి రద్దీతో సంబంధం లేకుండా 8 గంటల్లోపే దర్శనం కల్పించే  విధంగా టీటీడీ కాలినడక దర్శనం ఏర్పాటు చేసింది.
 
 సిఫారసు లేకుండానే లడ్డూలు
 ఎవరి సిఫారసు లేకుండానే భక్తులు నేరుగా ఆలయం పక్కనే ఉన్న - అదనపు లడ్డూ కౌంటర్‌లో రూ.25 చొప్పున రూ.50కి రెండు, రూ.100కి నాలుగు లడ్డూలు అందజేస్తారు. ఇలా రోజుకు లక్ష లడ్డూలు అందజేస్తారు.
 
 రెండో వైకుంఠంలో సర్వదర్శనం:  ప్రధానంగా క్యూలైన్లద్వారా రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండి సర్వదర్శనం పొందవచ్చు. వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు, పాలు, కాఫీ, టీ, మజ్జిగ వంటి పదార్థాలు ఉచితంగా అందజేస్తారు.
 యాక్సెస్ కార్డులతో తిరిగి సర్వదర్శనం క్యూలోకి: రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచే సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.


 సిఫారసు లేకుండానే రూ.300 టికెట్ల దర్శనం: ఎవరి సిఫారసు లేకుండానే భక్తులు నేరుగా రూ.300 టికెట్లు కొనుగోలు చేసి దర్శనానికి వెళ్లే సౌకర్యాన్ని టీటీడీ కల్పించింది. రోజుకు 15 వేల నుంచి 20 వేల మందికి దర్శనం కల్పిస్తున్నారు
 విజయాబ్యాంకులో సులభంగా ఆర్జిత సేవలు: శ్రీవారి ఆర్జిత సేవలను తిరుమలలోని విజయబ్యాంకులో కేటాయిస్తారు. నిత్య, వార సేవల్ని నిర్ణీత సంఖ్యలో నిత్యం కేటాయిస్తారు. ఆయా సేవల్లో అందుబాటులో ఉన్న టికెట్లను ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి భక్తుల వేలి ముద్రలు, ఫొటోలను తీసుకని ఫొటోమెట్రిక్ విధానంలో మంజూరు చేస్తారు.


 ఇంటర్‌నెట్‌లో ఆర్జిత సేవలు, రూ.50 సుదర్శనం, గదులు
     90 రోజులకు కోటా విడుదల చేస్తారు. ప్రతి ఒక్కరూ 91వ రోజున అందుబాటులో ఉండే సేవలు, దర్శనాలు, గదులు రిజర్వు  చేసుకోవచ్చు.
     www.ttdsevaonline.com వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.
     రాత్రి 11.45 గంటల నుంచి  వెబ్‌సైట్‌లో కోటా టికెట్ల విడుదల చేసే కార్యక్రమాన్ని ఆరంభిస్తారు. 12.15కు కోటా విడుదల చేసేందుకు సిద్ధమవుతారు. ఇందుకోసం వ్యక్తిగత ఈ-మెయిల్ ఐడీతో రిజిస్టర్ చేసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement