breaking news
Lodging Facilities
-
దారి చూపులు
సాయంత్రం నాలుగవుతోంది. లావణ్య కాలేజీ నుంచి ఇంటికి బయల్దేరింది. ఇంటికి కాలేజీ చాలా దగ్గర. రోజూ ఆ దారెంట నడుస్తూనే వెళుతుంది. కాలేజీకి పక్కన్నే సితార హాస్పిటల్. దానిపక్కన శ్రీధర్ లాడ్జి. ఆ తర్వాత వేదిక కాంప్లెక్స్. అది దాటుకొని వెళితే మదీనా బిర్యానీ సెంటర్. అక్కణ్నుంచి మలుపు తిరిగితే వచ్చే వీధిలో ఐదో ఇల్లే లావణ్య వాళ్ల ఇల్లు. లావణ్య కాలేజీ గేటు బయటకొచ్చి మెయిన్‌రోడ్డు మీదనుంచి సితార హాస్పిటల్ దాటి, శ్రీధర్ లాడ్జి ముందుకొచ్చింది. ఈ రోడ్డంతా రోజూ వచ్చే పోయే వాహనాలతో రద్దీగా ఉంటుంది. ఇవ్వాళెందుకో అక్కడి వాతావరణమంతా లావణ్యకు ప్రశాంతంగా అనిపించింది. వేదిక కాంప్లెక్స్ దగ్గరకొచ్చేసరికి ఆమె మనసు అదోలా అయిపోయింది. నిన్నటిరోజు సరిగ్గా ఇదే సమయానికి కాలేజీ నుంచి వస్తూంటే, శ్రీధర్ లాడ్జి ముందు లావణ్యకు అక్కడక్కడా ముగ్గురు, నలుగురు జట్టుగా నిలబడి గుసగుసలాడుకోవడం కనిపించింది. ఒక అడుగు వాళ్లను చూస్తూ వేస్తూ, ఇంకో అడుగు వాళ్లను చూడకుండా వేస్తూ నడుస్తోంది లావణ్య. వేదిక కాంప్లెక్సు ముందుకొచ్చేసరికి లావణ్యకు సరిగ్గా మూడడుగుల దూరంలో రోడ్డు మీద రక్తపు మరకలు ఎర్రని దుప్పటి కప్పినట్లుగా పరుచుకున్నాయి. అది చూసి ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగి ఉంటుందని అనుకుంది. వాళ్లంతా ఎందుకు గుసగుసలాడుకుంటున్నారో ఆమెకు అర్థమైంది. మదీనా బిర్యానీ సెంటర్ ముందు లావణ్యకు వాళ్ల పక్కింటావిడ కనిపించింది. లావణ్య కాస్త ముందుకు వెళ్లి ఆమెను ఈ ప్రమాదం గురించి అడుగుదామనుకుంది. ఈలోపు ఆమే, ‘‘ఏదో యాక్సిడెంట్ అంటమ్మా! అర్ధగంట క్రితమే రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తిని పెద్ద లారీ దాని చక్రాల కింద నలిపేసి వెళ్లిపోయిందట. పాపం అతను అక్కడికక్కడే చనిపోయాడట. అతను ఎవరో ఏంటో కూడా ఎవరికీ తెలియదట. అతని దగ్గర సెల్‌ఫోన్ కూడా లేదట..’’ చెప్తూ పోయిందామె. నిన్న పక్కింటావిడ చెప్పిన ఈ మాటలన్నీ గుర్తు చేసుకుంటూ, పాపం అతనికి సంబంధించిన వాళ్లు ఎక్కడున్నారో అనుకుంటూ ఇంటికి చేరింది లావణ్య. ఆ తర్వాతిరోజు అదే దారిలో ఇంటికెళ్తూంటే వీధి మలుపు దగ్గర లావణ్యకు ఒక చిన్నమ్మాయి కనిపించింది. పదేళ్లుంటాయేమో ఆ అమ్మాయికి. మాసిపోయిన బట్టలతో, నల్లగా, బక్కచిక్కి ఉంది. నిజానికి లావణ్య అంతకుముందు రోజే ఆ అమ్మాయిని చూసింది. ఒకసారి రోడ్డుపైన, ఇంకోసారి కాలేజ్ పక్కన, మరోసారి వారుండే వీధిలో అక్కడక్కడే తచ్చాడుతూంటే లావణ్య ఆ అమ్మాయిని చూసింది. బిత్తరచూపులు చూస్తూ, దిగులుగా, ఏదో పోగొట్టుకున్నట్లుగా, ఇంకేదో వెతుకుతున్నట్లుగా ఉంది. లావణ్యకు జాలేసింది. ఆ అమ్మాయి దిగులు వెనక ఏముందో తెలుసుకోవాలనుకుంది. ఆ అమ్మాయికి ఎదురుగా వెళ్లి, అడ్డంగా నిలబడింది లావణ్య. ఆ అమ్మాయి లావణ్యను అయోమయంగా చూసింది. ‘‘ఎవర్నువ్వు? ఏదైనా పోగొట్టుకున్నావా? లేదా ఎవరినైనా వెతుకుతున్నావా?’’ అడగాలనుకున్న ప్రశ్నలన్నీ టకటకా అడిగేసింది లావణ్య. ఆ అమ్మాయి తేరుకొని.. ‘‘అక్కా.. మా మావయ్య రెండురోజుల నుంచి కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్లాడో తెలియడం లేదు..’’ లావణ్య ఆ అమ్మాయి వంకే చూస్తోంది. ‘‘మేం వేరే ఊర్నుంచి ఇక్కడికి వచ్చాము. అక్కడ పనులు లేవని పట్నంలో చాలా పనులుంటాయని నన్ను, మా అమ్మను మావయ్యే ఇక్కడికి తీసుకొచ్చాడు. ఏదో రైసు మిల్లులో పని దొరికిందని, తను, అమ్మ వెళ్లొచ్చని, నన్ను బడిలో చేర్పిస్తానన్నాడు. కానీ మొన్న పనిమీద వెళ్లిన మావయ్య ఇంతవరకూ తిరిగిరాలేదు. ఇక్కడ మాకెవ్వరూ తెలీదు. ఎవరిని అడగాలో తెలీక మావయ్యను నేనే వెతుకుతున్నా..’’ అంది.‘‘ఒకవేళ ఊరెళ్లాడేమో’’ అంది లావణ్య. ‘‘లేదక్కా! మాకు మావయ్య, మావయ్యకు మేం తప్ప అక్కడ ఇంకెవ్వరూ లేరు. మావయ్య ఊరెళ్లి ఉండడు..’’ అంది ఆ అమ్మాయి. లావణ్య వెంటనే ఏదో చెప్పబోతూంటే ఆ అమ్మాయి ఎవరో పిలిచినట్టు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. ఎవరో ఆడమనిషిని చూసి ఆ అమ్మాయి వాళ్ల అమ్మ అయ్యి ఉంటుంది అనుకుంటూ ఇంటిముఖం పట్టింది లావణ్య. ఇంట్లోకి వెళ్లగానే లావణ్యకు హాల్లో వాళ్ల మావయ్య కనిపించాడు. ఆయనకు ఆ ఊర్లోనే అతిపెద్ద రైసు మిల్లు ఉంది. నాన్నతో కలిసి ఏదో మాట్లాడుతూ ఉన్న మావయ్యను చూసి చూడనట్లే లోపలికెళ్లిపోయింది లావణ్య. నాన్న, మావయ్య ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. లోపలున్న వారికీ ఆ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ అవేవీ పట్టించుకోనట్లే తన పని తాను చేసుకుంటోంది లావణ్య. ఒక్కసారే మావయ్య ఏదో గుర్తొచ్చినవాడిలా.. ‘‘అన్నట్టు నీకో విషయం చెప్పాలి బావా!’’ అన్నాడు. అంతసేపు ఆ మాటలను పట్టించుకోనట్టున్న లావణ్య ఎందుకో ఇదంతా ఆసక్తిగా వినడం మొదలుపెట్టింది. ‘‘మూడు రోజుల క్రితం ఒకతను మిల్లుకొచ్చాడు. ఏదైనా పనుంటే ఇవ్వమని ఎంత కష్టమైనా చేస్తానని, అలాగే తన చెల్లికీ పని ఇప్పించమని బతిమిలాడాడు. సరే ఏదో కష్టాల్లో ఉన్నట్టున్నాడు కదా అని రమ్మని చెప్పా. ఆరోజే అతను రోడ్డు ప్రమాదంలో చనిపోయాడట. ఇక్కడే వేదిక కాంప్లెక్స్ ఉండ్లా, అక్కడ జరిగిందట. బాధాకరం ఏంటంటే ఇంతవరకూ అతని వాళ్లెవ్వరూ రాలేదట..’’ మావయ్య మాటలు వింటూంటే లావణ్యకు ఒక్కొక్కటిగా అంతకుముందు ఆ అమ్మాయి చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. లావణ్యకు మెల్లిగా అర్థమైపోయింది, ఆ అమ్మాయికి మావయ్య, ఇప్పుడు మావయ్య చెప్తున్న వ్యక్తి ఒక్కరేనని. ‘ఓరి దేవుడా! ఎంత ఘోరం జరిగిపోయింది. వాళ్లకు దిక్కెవరు? అతను లేకుండా వాళ్లు బతుకుతారా? ఇది తెలిస్తే వారు ఊరుకుంటారా? ఏడుస్తారు. బాగా ఏడుస్తారు. గుండెలు పగిలేలా ఏడుస్తారు..’ లావణ్య మెదడులో రకరకాల ప్రశ్నలు, ఆలోచనలు పట్టాల మీద రైలు పరిగెడుతున్నట్టు పరిగెడుతున్నాయి. ఒక్క ఉదుటున ఇంట్లోంచి బయటకొచ్చింది లావణ్య. వాళ్లమ్మ పిలుస్తున్నా వినిపించుకోకుండా పరిగెడుతోంది. నిజానికి తనిప్పుడు వినిపించుకునే స్థితిలో కూడా లేదు. ఆ అమ్మాయి కోసం పిచ్చిదానిలా పరుగులు పెట్టింది. రోడ్ల వెంబడి తిరిగింది. అంతపెద్ద మనిషి రెండురోజులు కనిపించకపోతే కంగారు పడిన ఆ అమ్మాయి ధోరణి అర్థం కాని లావణ్య ఆ కంగారు వెనక ఇంత విషాదం దాగుంటుందని అప్పటికి ఊహించలేదు. ఈ విషయం ఆ అమ్మాయికి చెప్పాలని తపించుకుపోయింది. కాలేజీ చుట్టుపక్కల, అవతలవైపు అంతా తిరిగి వస్తుంటే వేదిక కాంప్లెక్స్ ముందు కనిపించింది. ఆ అమ్మాయిని చూడగానే ప్రాణం లేచొచ్చినట్లయింది లావణ్యకు. పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ అమ్మాయి ముందు నిలబడింది. ‘‘మీ మావయ్య.. మీ మావయ్య..’’ అంటూ నసుగుతూ ఉంటే ఆ అమ్మాయి వాళ్లమ్మ లావణ్య చెప్పేదేదీ వినిపించుకోకుండానే, ‘‘ఏంటమ్మా! వాళ్ల మావయ్య కనిపించడం లేదన్న విషయం నీకు చెప్పిందా?’’ అంటూ – ‘‘మా అన్నయ్యకు మేమంటే ఎనలేని ప్రేమ. మా అన్న తప్ప మాకు ఎవ్వరూ లేరు. మమ్మల్ని వదిలి ఆయన ఎక్కడికీ వెళ్లడు. అన్నయ్య లేకుండా మేం ఉండలేమని ఆయనకు తెలుసు. అలాంటివాడు ఎక్కడికి వెళతాడు? ఎప్పటికైనా తిరిగొస్తాడు.’’ ఆవిడ పలికిన ఆ రెండు ముక్కలు విన్నాక లావణ్య అప్పటివరకూ పడిన ఆరాటం, తపన ఒక్కసారే ఎక్కడికో ఎగిరిపోయాయి. దానికి బదులుగా ఇప్పుడు వారికి నిజం చెప్పాలా వద్దా అనే దిగులు మొదలైంది. ఒక్కక్షణం అలా నిలబడిపోయింది లావణ్య. నిజం తెలిసి వారి గుండెలు బద్దలు అవడం కన్నా అతను ఎప్పటికైనా తిరిగొస్తాడనే వారి భ్రమే సరైనదిగా తోచింది. అతనిపై వారికున్న నమ్మకం తిరిగొస్తాడనుకునేలా చేస్తోంది. కానీ అతను తిరిగి రాలేడని తెలిస్తే? అసలు అతను ఈ లోకంలోనే లేడని చెబితే? ఊహూ.. వారికింక ఏదీ చెప్పదలుచుకోలేదు లావణ్య. వచ్చిన దారినే వెనుతిరిగింది. లావణ్య వేదిక కాంప్లెక్స్ ముందు నిలబడిందిప్పుడు. ఆరోజు ఆమె చూసిన రక్తపు ఆనవాళ్లు కూడా కనబడలేదు. ముందుకు నడుస్తూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది లావణ్య. ఆ తల్లీ కూతుళ్లు రోడ్డు దాటుతున్నారు. మళ్లీ ఏదో వెతుకుతున్నట్లుగా దిక్కు చూపులు చూస్తున్నారు. కానీ అవి దిక్కు చూపులు కావు. ఒకరు వాళ్ల మావయ్య, ఇంకొకరు వాళ్ల అన్నయ్య ఎటునుంచి వస్తాడో అని చూస్తోన్న ఎదురుచూపులు. కానీ అతనెప్పటికీ తిరిగి రాడని, వాళ్లకు అండగా ఉండలేడని, వారికి ప్రేమ పంచడం, వారి ప్రేమ పొందడం జరగదని, ఇవేవీ వారికి తెలియకూడదనీ కోరుకుంది లావణ్య. ఎప్పటికైనా అతను తిరిగొస్తాడనే భ్రమలోనే వాళ్లు ఉండాలని, అతని కోసం ఎదురుచూపులు ఇలాగే కొనసాగాలని కోరుకుంది. మళ్లీ వెనక్కి తిరిగి చూడకుండా భారంగా అడుగులేసుకుంటూ వెళ్లిపోయింది లావణ్య. - షేక్ షబానా -
తిరుమల యాత్ర.. సులభతరం ఇలా...
శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు దేవస్థానం అన్ని రకాల మౌలిక సదుపాయాలనూ కల్పిస్తోంది. అయితే... బస సౌకర్యాలు ఎన్ని రకాలు? వాటిని ఏ విధంగా పొందాలి? ఏయే రకాల దర్శనాలు ఉన్నాయి? వాటి వేళలు, నిత్య, వార, వార్షిక ఆర్జితసేవలు ఎలా పొందాలి? టీటీడీ ఈ -దర్శన్ కేంద్రాల ద్వారా గదులు, దర్శనం, ఆర్జిత సేవలు ఎలా ముందుగానే రిజర్వు చేసుకోవచ్చు... వంటి సమాచారం సరిగా తెలియక దళారుల చేతిలో మోసపోకుండా మీకోసం... గదులు సులువుగా పొందడమెలా..! శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చే భక్తుల కోసం అన్ని ప్రాంతాల్లో మొత్తం 6626 గదులు అందుబాటులో ఉన్నాయి. (సీఆర్వో/కేంద్రీయ విచారణ కార్యాలయం)లో 5428 గదులు భక్తులకు కేటాయిస్తారు. ఇందులో మొత్తం 200 ఉచిత గదులు. రూ.50 అద్దెగదులు 2083, రూ.100 అద్దెగదులు 2176, రూ.500 అద్దె గదులు 576, రూ.600 అద్దెగదులు 333, రూ.750 అద్దె గదులు 60 ఉన్నాయి. ఎటువంటి సిఫారసులు లేకుండా భక్తులే నేరుగా గదులు పొందవచ్చు. అన్ని రిసెప్షన్ కేంద్రాలు 24 గంటలూ పనిచేస్తాయి. భక్తులు నేరుగా క్యూలైన్లలో వేచి ఉండి గదులు పొందవచ్చు. ప్రజాప్రతినిధి, ఇతర ప్రముఖుల సిఫారసుల లేఖలతోనూ, ఇంటర్నెట్ ద్వారా కూడా గదులు పొందవచ్చు. ఆయా తరగతుల భక్తులకు టీటీడీ రిసెప్షన్ విభాగం వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరుగా కౌంటర్లు సిద్ధ్దం చేసింది. సమాచారం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్: 0877- 2263572 సిఫారసు లేఖలపై: సీఆర్వోలోని టీబీ కౌంటర్‌కు 600 గదులను కేటాయిస్తారు. ఇందులో ఎమ్మెల్యే, ఎంపీ, టీటీడీ బోర్డు సభ్యులు, ఇతర ప్రభుత్వ అధికారుల సిఫారసు లేఖలపై గదులు కేటాయిస్తారు. సమాచారం కోసం సంప్రదించాల్సిన నంబర్: 0877-2263518. 10 రోజుల ముందస్తు సమాచారంతో వచ్చే దాతలకు: సీఆర్వో కార్యాలయంలోని దాతల విభాగంలో 10 రోజుల ముందు బుక్ చేసుకున్న దాతలు తమ పాస్‌బుక్ ద్వారా గదులను ఉచితంగానే పొందవచ్చు. సమాచారం కోసం 0877-2263472 సంప్రదించవచ్చు. ప్రముఖుల కోసం: పద్మావతి విచారణ కార్యాలయంలో ప్రముఖుల కోసం 620 గదులు ఉన్నాయి. ప్రముఖులు, టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు, అధికారుల సిఫారసు లేఖలకు గదులను కేటాయిస్తారు. భక్తులు తమ వద్దనున్న ప్రభుత్వ గుర్తింపు కార్డులు చూపి కూడా గదులను పొందే సౌకర్యం ఉంది. ఫోన్ నం: 0877-2263731 సిఫారసు లేకుండానే: పద్మావతి కార్యాలయంలో ఇటీవల ఎవరి సిఫారసు లేకుండానే భక్తులు నేరుగా గదులు పొందేలా అధికారులు కియాస్క్(రామ్స్) యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో రూ. 500 నుంచి రూ.6వేల వరకు అద్దె కలిగిన సన్నిధానం, శ్రీచక్ర, ఆదిశేషు, శంకుమిట్ట అతిథిగృహాల్లోని 400 గదులను పొందుపరిచారు. కియాస్క్ యంత్రంలో భక్తుడు తమ వ్యక్తిగత వివరాలు, పాన్‌కార్డ్, ఆధార్‌కార్డ్, డ్రైవింగ్ లెసైన్స్, పాస్‌పోర్టు వంటి తొమ్మిది ప్రభుత్వ గుర్తింపు కార్డులోని ఏదైనా ఒక నిర్దేశించిన నెంబరును నమోదు చేసుకుని సులభంగా గదిని పొందవచ్చు. సామాన్య భక్తులు, గదుల కొరతను దృష్టిలో ఉంచుకుని టీటీడీ తిరుమలలో నాలుగు యాత్రికుల వసతి సముదాయాలు(పీఏసీ) నిర్మించింది. నాలుగు పీఏసీలోని 23 హాళ్లల్లో మొత్తం 5806 లాకర్లు భక్తులకు ఉచితంగా కేటాయిస్తారు. ఈ సముదాయాల్లో సుమారు 20 వేల మంది భక్తులకు సరిపడా మరుగుదొడ్లు, స్నానాల గదులు, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. వసతిసముదాయం-2లో తలనీలాలు సమర్పించుకునేందుకు కల్యాణకట్ట సదుపాయం కూడా అందుబాటులో ఉంది. వివిధ మార్గాల్లో శ్రీవారి దర్శనం శ్రీవారి దర్శనానికి భక్తులు వివిధ మార్గాల్లో వెళతారు. ప్రధానంగా సర్వదర్శనం (ధర్మదర్శనం), అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాటల్లో నడిచివచ్చిన భక్తులకు ఉచిత దివ్యదర్శనం దర్శనం, రూ.300 టికెట్ల దర్శనం, అడ్వాన్స్ బుకింగ్‌లో కేటాయించే రూ.50 సుదర్శనం టికెట్ల దర్శనం, అడ్వాన్స్ బుకింగ్‌లో కేటాయించే ఆర్జిత సేవలు, తిరుమలలో విజయబ్యాంకులో ముందు రోజు ఇచ్చే ఆర్జిత సేవల దర్శనం, పొర్లుదండాల (అంగప్రదక్షిణ) దర్శనం, ప్రముఖుల సిఫారసు లేఖలపై ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవల దర్శనాలు ఉన్నాయి. ఇక ఇంటర్నెట్ ద్వారా ఆర్జిత సేవలు పొందే సౌకర్యాన్ని టీటీడీ కల్పించింది. సబ్సిడీపై మైకుసెట్లు, విగ్రహాలు, గొడుగులు, శేషవస్త్రాలు..! హిందూ ధర్మప్రచారంలో భాగంగా రాష్ట్రంలోని ఇతర ఆలయాలకు మైకుసెట్లు, రాతి విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు, ఉత్సవాల్లో వినియోగించే గొడుగులు, శేషవస్త్రాలు టీటీడీ సమకూర్చుతోంది. కొన్ని ఉచితంగాను, మరికొన్ని సబ్సిడీ ధరలపై భక్తులకు కేటాయిస్తోంది. టీటీడీ నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలు, దరఖాస్తులు సమర్పించి వీటిని పొందవచ్చు. ఇంటర్నెట్, ఈ-దర్శన్‌కేంద్రాల్లో నిత్య ఆర్జిత సేవల కోటా ఆర్జితసేవ ఇంటర్నెట్ ఈ-దర్శన్ సుప్రభాతం 50 50 తోమాల 10 - అర్చన 10 - వసంతోత్సవం 50 120 కల్యాణోత్సవం 150 100 ఊంజల్‌సేవ - 50 ఆర్జిత బ్రహ్మోత్సవం 25 60 సహస్రదీపాలంకరణ సేవ - 125 నిజపాద దర్శనం 100 200 విశేష పూజ 125 125 అష్టదళపాద పద్మారాధన 20 40 శ్రీవారినిత్య సేవలు - హాజరు సమయం సేవలు సమయం ధర వ్యక్తులు సుప్రభాతం 02.00 120 1 తోమాల సేవ 03.00 220 1 (మంగళ/బుధ/గురు) అర్చన 03.30 220 1 (మంగళ/బుధ/గురు) కల్యాణోత్సవం 10.00 1000 2 ఆర్జిత బ్రహ్మోత్సవం 12.30 200 1 డోలోత్సవం(ఊంజల్‌సేవ) 11.00 200 1 వసంతోత్సవం 13.30 300 1 సహస్రదీపాలంకరణ 17.00 200 1 ఏకాంత సేవ (టికెట్లు అనుమతించరు) వారపు ప్రత్యేక సేవలు వారం హాజరు సమయం ధర వ్యక్తులు సోమవారం - విశేషపూజ 05.00 600 1 మంగళవారం - అష్టదళ పాదపద్మారాధన సేవ 05.30 1250 1 బుధవారం - సహస్ర కలశాభిషేకం 05.30 850 1 గురువారం - తిరుప్పావడసేవ 05.30 850 1 శుక్రవారం - వస్త్రాలంకార సేవ 03.00 12,250 2 శుక్రవారం - పూరాభిషేకం 03.00 750 1 కమిషనర్ వారి అనుమతి, ఆలయ ఫొటో, దరఖాస్తు చేసుకున్నవారి ఫొటో ధృవీకరణ పత్రం, ఆలయ నమూనా (ప్లాను), తహసీల్దార్ నుంచి అనుమతి పత్రం సమర్పించాలి. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం, కేటీ రోడ్డు, తిరుపతి, అదనపు సమాచారం కోసం జనరల్ విభాగం ఏఈవో ఫోన్ నెంబరు 0877- 2264100కు సంప్రదించవచ్చు. కాలినడకనవచ్చే భక్తులకోసం... తిరుపతిలోని అలిపిరి మీదుగా కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు గాలిగోపురం వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద ఫొటోమెట్రిక్ విధానంలో భక్తుల ఫొటోలు, వేలిముద్రలు తీసుకుని టికెట్లు ఇస్తారు. అలాగే, శ్రీవారి మెట్టుమార్గంలోనూ వచ్చే భక్తులకు మార్గమధ్యంలో టికెట్లు అందజేస్తారు. వీరికి రద్దీతో సంబంధం లేకుండా 8 గంటల్లోపే దర్శనం కల్పించే విధంగా టీటీడీ కాలినడక దర్శనం ఏర్పాటు చేసింది. సిఫారసు లేకుండానే లడ్డూలు ఎవరి సిఫారసు లేకుండానే భక్తులు నేరుగా ఆలయం పక్కనే ఉన్న - అదనపు లడ్డూ కౌంటర్లో రూ.25 చొప్పున రూ.50కి రెండు, రూ.100కి నాలుగు లడ్డూలు అందజేస్తారు. ఇలా రోజుకు లక్ష లడ్డూలు అందజేస్తారు. రెండో వైకుంఠంలో సర్వదర్శనం: ప్రధానంగా క్యూలైన్లద్వారా రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లలో వేచి ఉండి సర్వదర్శనం పొందవచ్చు. వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు, పాలు, కాఫీ, టీ, మజ్జిగ వంటి పదార్థాలు ఉచితంగా అందజేస్తారు. యాక్సెస్ కార్డులతో తిరిగి సర్వదర్శనం క్యూలోకి: రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచే సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సిఫారసు లేకుండానే రూ.300 టికెట్ల దర్శనం: ఎవరి సిఫారసు లేకుండానే భక్తులు నేరుగా రూ.300 టికెట్లు కొనుగోలు చేసి దర్శనానికి వెళ్లే సౌకర్యాన్ని టీటీడీ కల్పించింది. రోజుకు 15 వేల నుంచి 20 వేల మందికి దర్శనం కల్పిస్తున్నారు విజయాబ్యాంకులో సులభంగా ఆర్జిత సేవలు: శ్రీవారి ఆర్జిత సేవలను తిరుమలలోని విజయబ్యాంకులో కేటాయిస్తారు. నిత్య, వార సేవల్ని నిర్ణీత సంఖ్యలో నిత్యం కేటాయిస్తారు. ఆయా సేవల్లో అందుబాటులో ఉన్న టికెట్లను ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి భక్తుల వేలి ముద్రలు, ఫొటోలను తీసుకని ఫొటోమెట్రిక్ విధానంలో మంజూరు చేస్తారు. ఇంటర్నెట్లో ఆర్జిత సేవలు, రూ.50 సుదర్శనం, గదులు 90 రోజులకు కోటా విడుదల చేస్తారు. ప్రతి ఒక్కరూ 91వ రోజున అందుబాటులో ఉండే సేవలు, దర్శనాలు, గదులు రిజర్వు చేసుకోవచ్చు. www.ttdsevaonline.com వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. రాత్రి 11.45 గంటల నుంచి వెబ్సైట్లో కోటా టికెట్ల విడుదల చేసే కార్యక్రమాన్ని ఆరంభిస్తారు. 12.15కు కోటా విడుదల చేసేందుకు సిద్ధమవుతారు. ఇందుకోసం వ్యక్తిగత ఈ-మెయిల్ ఐడీతో రిజిస్టర్ చేసుకోవాలి.


