మన చెరువే మన జీవన నాదం | Our pond | Sakshi
Sakshi News home page

మన చెరువే మన జీవన నాదం

Apr 13 2015 2:20 AM | Updated on Sep 3 2017 12:13 AM

అమర్

అమర్

ప్రకృతికి నీళ్లు చోదకుని లాంటివి అన్న ఇటాలియన్ ప్రజ్ఞాశాలి డావెన్సీ మాటలు ప్రపంచ మనుగడలో నీటి పాత్రను తెలుపుతున్నాయి.

 ప్రకృతికి నీళ్లు చోదకుని లాంటివి అన్న ఇటాలియన్ ప్రజ్ఞాశాలి డావెన్సీ మాటలు ప్రపంచ మనుగడలో నీటి పాత్రను తెలుపుతున్నాయి. 1922 మొదలుగా మార్చి 22వ తేదీని ప్రపంచ జల దినంగా ప్రకటిస్తూ వచ్చిన ఐక్యరాజ్య సమితి 2015 ను నీళ్లు నిలకడ కలిగిన అభివృద్ధి అంటూ పిలుపుని చ్చింది. భారత ఉపఖండాన్ని ప్రభావితం చేస్తున్న గంగానది ప్రక్షాళనకు ఉద్దేశించిన లైవ్‌గంగా ప్రా జెక్టు (ఎల్‌జీపీ) తన లక్ష్యాన్ని ‘జీవితం కోసం నదు లు, నదుల కోసం జీవితం’గా అభివర్ణించింది. కానీ నీటిని ప్రయివేటీకరించడానికి లేదా ప్రభుత్వ ప్రైవే ట్ భాగస్వామ్యంతో తన గుత్తాధిపత్యంలోనికి తీసు కోవడానికి  ప్రపంచ బ్యాంకు తీవ్రంగా ప్రయత్నిస్తు న్న తరుణంలో నదులు, నీళ్లు, పర్యావరణం వంటి అంశాల పట్ల అప్రమత్తత అవసరం. మానవ సమా జాలు గీసుకున్న దేశాలు, రాష్ట్రాలు అనే రాజ కీయ సరిహద్దులను చెరుపుతూ అంతర్జాతీయ సుహృ ద్భావాన్ని చాటుతున్న నదులను  ఎడారులుగా మార్చడం అభివృద్ధి కాజాలదు. అందుకే ప్రజాభి వృద్ధి కోణంలో గంగను, నదులను, నీళ్లను కాపాడు కుందాం. గంగానది పరిరక్షణపై మేధోమథనంలో రూ పొందించిన ముజఫర్‌పూర్ అంగీకార పత్రం ‘లౌటాదో నదియా హమారా’ (మా నదుల్ని తిరిగి వ్వండి) అంటూ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో నాకు మరో సరస్వతిలా అదృశ్యం కాబోతున్న గోదా వరి గురించి విజ్ఞులు చేసిన హెచ్చరికలు వినిపించా యి. గోదావరి- కృష్ణా నదుల తీరాన కొలువు తీరిన తెలంగాణ నీళ్లులేని కన్నీటి ఘోషలు కనిపించాయి. మురికికూపం మూసీనది, ఎండిన వాగులు, పాతాళ కుహరాల్లాంటి సింగరేణి ఓపెన్ కాస్ట్‌లు, కృత్రిమ నీటిపైపులు, గ్రానైట్ పేర పిండవు తున్న కొండలు, అడవులు అదృశ్యం కాగా మిగిలిన శిధిలావస్థలోని చెరువుల విషాద దృశ్యాలే మదిలో మెదిలాయి.

 గంగానది, మూసీనదుల ప్రక్షాళనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున నిధుల కేటాయిం పును ప్రకటిస్తున్న తరుణంలో వాటిని స్వచ్ఛంగా, సజీవంగా ప్రవహింపజేసే లక్ష్యం, చిత్తశుద్ధి ఆయా ప్రభుత్వాలకు ఉందా లేదా అని పరిశీలించుకోవాలి. పవిత్రత పేరిట నదులను కమ్యూనలైజ్ చేయ కుండా, టూరిజం, నావిగేషన్ల పేరిట వ్యాపారీకరిం చకుండా నదులను సజీవంగా పారనిద్దాం. తెలంగా ణ గొలుసు చెరువులు, రాయల చెరువులు, దశబం దు నూతులు, కట్టు కాలువలు, చెక్‌డ్యాంలు మున్న గు చిన్ననీటి పారుదల వ్యవస్థలు, స్వయంపోషక, స్వావలంబన విధానాలు తెలుగు నేలకంతటికీ సుపరిచితమైనవే. అటు పర్యావరణానికి చేటు కలిగి స్తూ, ఇటు రైతాంగ ఆత్మహత్యలకు కారణమ వుతు న్న విధ్వంసకర నమూనాకు ఇంతకంటే వేరే ప్రత్యా మ్నాయం లేదు.

 ఇప్పటికైనా, 21శతాబ్దంలో నీళ్ల కోసమే యుద్ధాలు జరుగుతాయన్న  నిపుణుల హెచ్చరికను తీవ్రంగా పరిగణించాలి. నదుల సజీవతకు జలవన రుల అభివృద్ధికి వర్షపు నీటిని కాపాడే వికేంద్రీకరణ పద్ధతులు రచించుకునే దీర్ఘకాలిక దృష్టి అవసరం. చెరువుల నిర్మాణం, పునరుద్ధరణతోపాటు వాటికి నీటిని అందించే వాగులు, వంకలను కూడా బతికిం చుకోవాలి. భారీనీటి ప్రాజెక్టులు, కొండలు, అడవు ల విధ్వంసం అనేది ఒక్క మాటలో చెప్పాలంటే బంగారు బాతుగుడ్లు పెట్టే బాతును ఒక్కసారే కోసి చంపడంలాంటిది. గంగా ముక్తి ఆందోళన్ వారు వారణాసిలో నిర్వహించిన సదస్సు ఆ నదినే కాదు, మొత్తం నదులను, నీళ్లను కాపాడుకునే లక్ష్యంవైపు కార్యాచరణను రూపొందించుకోవాలని ఆశిద్దాం.

     వ్యాసకర్త జనశక్తి నాయకులు, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement