కరీనాకంటే ముందున్న దీపికా! | Deepika padukone leading than kareena Kapoor! | Sakshi
Sakshi News home page

కరీనాకంటే ముందున్న దీపికా!

Dec 13 2014 2:24 PM | Updated on Sep 2 2017 6:07 PM

దీపికా పదుకొనే - కరీనా కపూర్

దీపికా పదుకొనే - కరీనా కపూర్

సినిమాల్లోనే కాదు, టీవీ యాడ్‌లలోనూ దీపికా పదుకొనే హవా కొనసాగుతోంది.

 సినిమాల్లోనే కాదు, టీవీ యాడ్‌లలోనూ దీపికా పదుకొనే  హవా కొనసాగుతోంది. టెలివిజన్ యాడ్‌లలో  దీపికా తరువాత స్థానాన్ని కరీనా కపూర్ ఆక్రమించిందని టామ్‌ ప్రకటించింది. ఇక ప్రింట్ మీడియాలో సల్మాన్ ఖాన్ ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్నారని టామ్ గణాంకాలు చెబుతున్నాయి. ఓంశాంతి ఓం సినిమాతో 2007లో‌  తెరంగేట్రం చేసిన దీపికా పదుకొనే ఇప్పుడు బాలివుడ్‌ హాట్ హీరోయిన్‌లలో నెంబర్‌ వన్ స్థానంలో ఉన్నారు. కాక్‌టేల్‌ నుంచి చెన్నై ఎక్స్‌ప్రెస్‌ వరకు సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించిన దీపికా ఇప్పుడు బుల్లితెరను సైతం డామినెట్‌ చేస్తోంది.  ఈ పొడుగు కాళ్ల సుందరి కోసం ప్రొడ్యూసర్లే కాదు, పెద్ద పెద్ద బ్రాండ్‌లు క్యూకడుతున్నాయి. కోకో కోలా నుంచి యాక్సిస్‌ బ్యాంక్‌ వరకు  మేజర్ బ్రాండ్‌లను ప్రస్తుతం దీపికా ఎండార్స్‌ చేస్తోంది. కెల్లాగ్స్, హెచ్‌పీలాంటి 16 ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ప్రస్తుతం దీపికా ఖాతాలో ఉన్నాయి.  ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ప్రసారమైన సెలబ్రిటీ యాడ్‌లలో  5.2 శాతం దీపికవేనని టామ్‌ అడెక్స్‌ ప్రకటించింది.   కేవలం టాలెంటెడ్‌  యాక్టర్‌గానే కాకుండా యూత్‌ ఐకాన్‌గా దీపికాకు మంచి క్రేజ్‌ ఉంది.  చాలా మంది అమ్మాయిలు ఆమెను రోల్‌మాడల్‌గా బావిస్తుండటం వల్లే పెద్ద బ్రాండ్‌లు ఆమెను కోరుకుంటున్నాయని అడ్వర్టైజ్‌మెంట్ నిపుణులు భావిస్తున్నారు.

సెలబ్రిటీ యాడ్‌లలో దీపికా పదుకొనే తరువాత స్థానాన్ని కరీనాకపూర్‌ ఆక్రమించింది. ఇక సెలబ్రిటీ ఎండార్స్‌మెంట్‌లలో ఎలక్ర్టానిక్‌ మీడియాకు సంబంధించి 41 శాతం మహిళల అడ్వర్టైజ్‌మెంట్‌లు ఉండగా, మగవారు 42 శాతం ఆక్రమించారు.   అయితే ప్రింట్‌ మీడియా యాడ్‌లలో మాత్రం ఆడవారికంటే మగవారే ముందున్నారు.  ప్రింట్‌ మీడియా యాడ్‌లలో సల్మాన్‌ఖాన్ నెంబర్‌వన్‌గా నిలిచారు. సల్మాన్‌ తరువాత షారుఖ్‌ ఖాన్, అమితాబచ్చన్‌లు ఉన్నారు.  ఇక ప్రింట్‌ మీడియాలోనూ మహిళల స్థానంలో దీపికానే అందరికన్నా ముందుంది. దీపికా తరువాతి స్థానాన్ని ప్రియాంక ఆక్రమించింది.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement