థగ్గుకథ

థగ్గుకథ - Sakshi


narendrayan-36

 

 

గోల్కొండకు కొనసాగింపుగా హైదరాబాద్ నిర్మాణం జరిగిన కీ.శ.1591 తర్వాత ఎందరో ప్రముఖులు నగరం గురించి ఎన్నో విశేషాలను నమోదు చేశారు. విదేశీయులూ స్వదేశీయులూ! వారిలో పర్షియా చరిత్రకారుడు ఫరిస్తా, ఫ్రాన్స్ దేశానికి చెందిన వజ్రాల వ్యాపారి టావెర్నియర్, తెవెనాట్ అనే భాషాశాస్త్రజ్ఞుడు, బెర్నర్ అనే వైద్యుడు. అబ్బె క్యారీ అనే మతబోధకుడు ఉన్నారు. మనూచీ అనే ఇటాలియన్ వైద్యుడు, డచ్ ఈస్టిండియన్ కంపెనీకి చెందిన షూరర్, మెత్తోల్డ్ (డచ్ కంపెనీలో ప్రత్యర్థి దేశానికి చెందిన ఇంగ్లిష్ వ్యక్తి) కూడా నగరాన్ని సందర్శించిన ప్రముఖులే! ఫరిస్తా గోల్కొండ గురించి బీజాపూర్‌లో కూర్చుని రాశాడు. అతడు తప్ప మిగిలిన అందరూ 17వ శతాబ్దంలో నగరాన్ని సందర్శించారు. మొదావె అనే ఫ్రెంచ్ ఆర్మీ ఆఫీసర్ 18వ శతాబ్దంలో భాగ్యనగరాన్ని సందర్శించాడు.

 

రక్తపాత రహితం!



నగరం గురించి రాసిన ప్రముఖుల జాబితాలో ఒక ‘థగ్గు’  చేరాడు! 18-19 శతాబ్దాలలో ఇండియాలో థగ్గులు తమ ప్రభావాన్ని చూపారు. వీరిలో హిందువులు-ముస్లింలు ఉండేవారు. కాళికాదేవిని కొలిచేవారు. మణికట్టుకు పసుపురంగు రుమాల్‌ను కట్టుకునేవారు. ఒకవైపు నాణెం ముడివేస్తారు. తాము లక్ష్యంగా చేసుకున్న వారిని, అదను చూసి ఆ వస్త్రంతో చంపేసేవారు. చుక్క నెత్తురు చిందదు! ‘కాళికాదేవి రాక్షసులతో యుద ్ధం చేస్తున్నప్పుడు నేలపై పడ్డ ప్రతి నెత్తురు చుక్కా మరో రాక్షసునిగా మారిందిట. ఆ సందర్భంలో దేవి సృజించిన ఇద్దరు వ్యక్తులు, దస్తీలతో ఒక్క నెత్తుటి బొట్టు కిందపడకుండా చూశారు. దేవతకు విజయం చేకూర్చారు. వారి వారసులే తామ’ని థగ్గుల నమ్మకం!

 

ఏడు ‘సెంచరీలు’ దాటాడు!




బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ (1828-35) లార్డ్ విలియం బెంటింగ్.. అమానుషకాండలకు పాల్పడుతున్న థగ్గులపై వేటు వేశాడు. వారి తంతును నిషేధించాడు. స్లీమన్ అనే బ్రిటిష్ పోలీస్ అధికారికి థగ్గుల నిర్మూలనా బాధ్యతలు అప్పగించాడు. మూర్‌హౌస్ జాఫ్రే నివేదిక ప్రకారం ఐదేళ్లలో 3,000 మంది థగ్గులు శిక్షకు గురయ్యారు. అమీర్ అలీ అనే థగ్గు కూడా శిక్షకుగురైన వాడే! మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో చెలరేగిన ఒకానొక థగ్గు బృందంలో అమీర్ అలీ సభ్యుడు. అతను అప్రూవర్‌గా మారి ఉరిశిక్షను తప్పించుకున్నాడు. అప్పటికి అతడి వయసు సుమారు నలభై ఏళ్లు. తాము పట్టుబడితే  నేరం అంగీకరించడం కూడా కాళికాదేవి అభిమతమే అని భావించేవారు. 719 మందిని హత్యచేసిన అమీర్ అలీ  పన్నెండు నెలలు జైలులో ఉన్నాడు. ఈ కాలాన్ని కూడా లెక్కవేసుకుంటే, ఈ హత్యల సంఖ్య వేయికి చేరేద న్నాడు. ‘అమీర్ అలీ కన్ఫెషన్స్’ 1839లో తొలిసారి ఇంగ్లండ్‌లో ప్రచురించారు. ఒక థగ్గు నేరాంగీకారం చేసినంత మాత్రాన ప్రముఖుల జాబితాలో చేరిపోతాడా? కానే కాదు..



 ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి,

 ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, 7680950863

 

 

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top