
మొగుడ్స్ పెళ్లామ్స్ ముఖాలు చూస్కోడం లేదు. ఎవరి ఫేస్‌లు వాళ్లు చూసుకుంటున్నారు! ఎవరికి వాళ్లు బుక్ అయి పోయారు. ఇప్పుడు కనుక పెళ్లి పుస్తకం అన్న సిరీస్ రాస్తే దాని టైటిలు ఇవాళ్టికి సూట్ అయ్యేలా రాయాల్సి వస్తుంది. ‘పెళ్లి బుక్’ అని. చూస్తున్నారా పైన? యువ జంట. చేసుకుంటోంది హ్యాపీగా వంట. అన్యోన్యంగా, హ్యాపీగా, ఫేస్ టు ఫేస్. మనకూ ఏడ్చింది బతుకు. మనకూ ఏడ్చిందొక ఫేస్ బుక్కు. ఇంట్లో ఉన్నంత సేపూ ఆ ఫేస్‌కే బుక్ అయిపోతున్నాం.
అసలు అలాంటి ఫేస్‌బుక్ ఇచ్చినవాడినీ.. నీ.. నీ... ఏం చేసినా పాపం లేదు. ఇంట్లో జంటలను.. కలిసి వంటలను చేసుకోనివ్వకుండా చేసిన ఫేస్‌బుక్ క్రియేటరే ఆ పైన కనిపిస్తున్న మహానుభావుడు. మార్క్ జుకర్‌బర్గ్. ఆయన, ఆయన శ్రీమతి లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని లవ్ చేసుకుంటూ ఉన్నారు. పెళ్లిలో ప్రేమను వండుతూనే ఉన్నారు. మారండి.. డియర్ కపుల్స్. కలిసి ఉండండి. కలిసి వండండి.