బంగారం తింటుంది.. ఇంధనం ఇస్తుంది!

Use of solar  gives energy - Sakshi

సష్టి చాలా విచిత్రమైంది. మూరెల్లా థెర్మోఅసిటికా అనే బ్యాక్టీరియా విషయమే తీసుకోండి. కాసింత బంగారం పడేస్తే... సౌరశక్తిని వాడుకుని బోలెడంత ఇంధనం ఇస్తుంది. యూసీ బెర్క్‌లీ శాస్త్రవేత్తలు ఈ బ్యాక్టీరియంపై కొన్ని పరిశోధనలు చేశారు. కాడ్మియం సల్ఫైడ్‌ నానో కణాలను బ్యాక్టీరియాపై పొరలకు అతికించి చూసినప్పుడు ఒకొక్కటి మినీ రియాక్టర్లు అయిపోయాయి.ఆ తరువాత ఇవి సౌరశక్తిని వాడుకుని కార్బన్‌డైయాక్సైడ్‌ను కాస్తా ఉపయోగకరమైన రసాయనాలు ఇంధనాలుగా  మారుస్తాయి.  కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలు శక్తిని తయారు చేసుకున్నట్లు అన్నమాట.  కాడ్మియం సల్ఫైడ్‌ స్థానంలో బంగారు నానోకణాలను వాడినప్పుడు ఇంధనాల ఉత్పత్తి మరింత మెరుగైనట్లు యూసీ బెర్క్‌లీ శాస్త్రవేత్త యాంగ్‌ చేసిన తాజా పరిశోధనలు చెబుతున్నాయి.

కాడ్మియం సల్ఫైడ్‌ కేవలం దశ్యకాంతిని మాత్రం శోషించుకోగలిగేది. అదే సమయంలో బ్యాక్టీరియాకు ఈ రసాయనం విషం. బంగారు నానోకణాలను వాడినప్పుడు మాత్రం ఈ లోపాలు తొలగిపోయి.. కార్బన్‌ డైయాక్సైడ్‌ నుంచి 33 శాతం ఎక్కువ అసిటేట్‌ ఇంధనం లభించిందని యాంగ్‌ తెలిపారు. మరిన్ని పరిశోధనల ద్వారా ఖర్చు తగ్గించడంతోపాటు, ఉత్పత్తి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని.. ఆ తరువాత ఈ పద్ధతి ద్వారా చౌకైన, మళ్లీమళ్లీ ఉత్పత్తి చేసుకోగల ఇంధనాల తయారీ సాధ్యమవుతుందని వివరించారు. 
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top