టారో : 26 నవంబర్‌ నుంచి 2 డిసెంబర్, 2017 వరకు

Tarot: from 26 November to 2 December, 2017 - Sakshi

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఈవారమంతా మీకు శుభ సూచకంగానే కనిపిస్తోంది. వృత్తి జీవితంలో ఓ కీలక మార్పు సంభవిస్తుంది. ఆ మార్పును ధైర్యంగా స్వీకరించండి. చిన్న చిన్న విషయాల్లోనూ ఆనందాన్ని వెతుక్కునే మీ స్వభావం మిమ్మల్ని మరింత ఎత్తుకు తీసుకువెళుతుందని నమ్మండి. ప్రేమ విషయం కొంత కలవరపెడుతుంది. ఇక్కడే ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇల్లు మారే సూచనలున్నాయి. ఇది మీకు ప్రశాంతతను చేకూరుస్తుంది. 
కలిసివచ్చే రంగు : నీలం 

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
ఈవారమంతా ఉత్సాహంగా పనిచేస్తారు. మీరు బాగా ఇష్టపడే వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఇది మీలో ఒక కొత్త ఉత్తేజాన్ని తీసుకురావడంతో పాటు ఆ వ్యక్తిని మీకు మరింత దగ్గర చేస్తుంది. ఎప్పట్నుంచో వాయిదా వేస్తూ వస్తోన్న ఒక పనిని ఇప్పుడు మొదలుపెడతారు. అందుకు ఇదే సరైన సమయం కూడా. కొత్త వాహనం కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం అని గ్రహించండి. కొన్ని ఒడిదుడుకులు, ఇబ్బందులూ ఉన్నా అన్నీ ఎదుర్కొని ముందుకెళతారు. 
కలిసివచ్చే రంగు : గోధుమ 

మిథునం (మే 21 – జూన్‌ 20)
ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. చాలాకాలంగా పడుతోన్న కష్టాలకు ఇక స్వస్తి పలికేందుకే అన్నట్టుగా మీకు రావాల్సిన డబ్బంతా ఒక్కసారే అందుతుంది. కొత్త అవకాశాలు వచ్చిపడతాయి. అందులో మీ స్థాయికి తగ్గవాటిని మాత్రమే ఎంచుకొని ముందుకెళ్లండి. ఒక విషయం గురించి నిరంతరం ఆలోచిస్తూ, కొన్నింట్లో వెనకబడతారు. ఆ విషయం మిమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి. ప్రేమ జీవితం సాఫీగా ఉంటుంది. 
కలిసివచ్చే రంగు : లేత ఆకుపచ్చ 

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకొని మీకై మీరే చిక్కుల్లో పడతారు. ప్రశాంతంగా అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా ఆ విషయంపై పూర్తి నిర్ణయం తీసుకునే ఆలోచన లేకుంటే, మౌనంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీరు బాగా ఇష్టపడే వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. బరువు తగ్గాలనుకుంటున్నా ఇదే సరైన సమయం. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లైతే కాస్త ఆలోచించండి. 
కలిసివచ్చే రంగు : లేత గులాబి 

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదేనని గ్రహించండి. కొత్త ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముడతాయి. కొత్త అవకాశాలు కూడా ఈ ఆలోచనల వల్లే దక్కుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ కనబర్చాల్సిన అవసరం చాలా ఉంది. ఎప్పట్నుంచో మొదలుపెట్టాలనుకొని ఆపేసిన పనులను ఇప్పటికైనా మొదలుపెట్టండి. మీకు ఇష్టమైన ఒక వ్యక్తితో వాగ్వాదం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. ప్రేమ జీవితం ఆందోళనకరంగా ఉంటుంది. 
కలిసివచ్చే రంగు : ఎరుపు 

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
మీ ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. ఎక్కువ ఆలోచించకుండా, మీకు సరైన అవకాశాలుగా అవి కనిపిస్తే, వాటిని అందిపుచ్చుకోండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. పెళ్లి సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఇష్టపడే వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయించేలా చూసుకోండి. మీ ఆలోచనా విధానంలోనూ కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అందుకు ఇదే సరైన సమయం కూడా అని గ్రహించండి. 
కలిసివచ్చే రంగు : పసుపు 

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఈ వారమంతా మీరు ఉల్లాసంగా గడుపుతారు. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. మీ ఆలోచనలు మళ్లీ ఉత్తేజమవ్వడానికి ఈ యాత్ర బాగా ఉపయోగపడుతుంది. మీ జీవిత భాగస్వామికి సమయం కేటాయించండి. వారితో జీవితాంతం గుర్తుపెట్టుకొనే ఆనందకర సమయాలను గడుపుతారు.  వృత్తి జీవితం చాలా బాగుంటుంది. ఉన్నత పదవిని అలంకరిస్తారు. కొద్దికాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోన్న సమస్యలు మెల్లిగా ఓ కొలిక్కి వచ్చేస్తాయి. 
కలిసివచ్చే రంగు : గోధుమ 

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
మీరు ఎప్పట్నుంచో కోరుకుంటోన్న ఓ విజయం అతి దగ్గరలో ఉంది. ఈ విజయంతో మీ ప్రతిభ ప్రపంచానికి పరిచయం అవుతుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే చాలా మెరుగుపడుతుంది. జీవితాన్ని మీదైన ఆలోచనా విధానంతోనే స్వీకరిస్తే, మీకు దక్కేదంతా సంతోషమేనన్న విషయాన్ని బలంగా నమ్మండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. పెద్ద మొత్తం పెట్టుబడులు పెట్టే ఆలోచనలు ఏమైనా ఉంటే ప్రస్తుతానికి అది మానుకోండి. మీ సంతోషం కోసం మీకేం అవసరమన్న విషయాన్ని సరిగ్గా అంచనా వేసుకోండి. 
కలిసివచ్చే రంగు : ముదురు ఆకుపచ్చ 

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
మీ జీవితం ఇప్పుడు సరైన దిశలోనే వెళుతోంది. కొన్ని ఊహించని అవకాశాలు మీ గమ్యాన్ని మరింత దగ్గర చేస్తాయి. మీదైన ఆలోచనా విధానాన్ని ఎప్పటికీ వదులుకోకండి. ఆ ఆలోచనా విధానంతోనే అందరికీ దగ్గరవుతారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది. అయితే ఎక్కువగా ఊహా ప్రపంచంలో విహరించే మీ స్వభావం మారాల్సిన అవసరం ఉంది. పని ఒత్తిడి వల్ల ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఈ విషయంలో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించండి. 
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ 

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
మీరు ఎంతో ఇష్టంగా చేపట్టిన ఓ ముఖ్యమైన పని త్వరలోనే విజయవంతంగా పూర్తవుతుంది. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. ఏదైనా విహారయాత్రకు వెళ్లే ఆలోచన ఉన్నట్లైతే ఇదే సరైన సమయం. మీ ఆలోచనా విధానం మిమ్మల్ని ధైర్యంగా ముందడుగు వేయించేలానే ఉండాలన్న విషయం గుర్తుంచుకోండి. మీ చుట్టూ ఉండే వ్యక్తులతోనే కొన్ని అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్త అవసరం. 
కలిసివచ్చే రంగు : వెండి 

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
అదృష్టం మీ వెన్నంటే ఉంటుందన్న విషయం గుర్తుంచుకోండి. కొన్ని ఊహించని అవకాశాలు మీ తలుపు తడతాయి. ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఆ అవకాశాలను అందిపుచ్చుకొని ముందడుగు వేయండి. వృత్తి జీవితంలో ఓ కీలక మార్పుకు సూచనలు కనిపిస్తున్నాయి. పెళ్లి సూచనలు కనిపిస్తున్నాయి. రానున్న నెలలో పదో రోజు ఓ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ నిర్ణయం మీ జీవితాన్నే మలుపు తిప్పేదన్న విషయం గుర్తుంచుకోండి.
కలిసివచ్చే రంగు : పీచ్‌ 

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
మీ జీవితంలో ఊహించని ఓ మార్పు చోటుచేసుకోబోతోంది. ఆ మార్పుకు సిద్ధంగా ఉండండి. మీదైన ఆలోచనా విధానమే మిమ్మల్ని విజయం వైపుకు అడుగులు వేయించే ఆయుధమని నమ్మండి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోతాయి. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. మరి కొద్దిరోజుల్లో అన్నీ సర్దుకుంటాయన్న విషయాన్ని నమ్మండి. ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ నిర్ణయం ఆలోచించకుండా మాత్రం తీసుకోవద్దు. 
కలిసివచ్చే రంగు : గులాబి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top