దుకుట్టీలు | Sakshi
Sakshi News home page

దుకుట్టీలు

Published Thu, Jan 17 2019 11:05 PM

This style is highlighted in traditional celebrations - Sakshi

దుపట్టా జారదు... చేతికి అడ్డం రాదుమోయాల్సిన అవసరం ఉండదుజాగ్రత్త చేసుకోవాల్సిన కష్టం ఉండదుఈ దుపట్టాలు కుట్టిన దుపట్టాలు. దుకుట్టీలు.

►బ్రౌన్‌ కలర్‌ సిల్క్‌ లెహెంగాకు స్టోన్, కట్‌దానా, జర్దోసీ వర్క్‌ చేసిన గ్రీన్‌ కలర్‌ బ్లౌజ్‌. ఆభరణాల అవసరం లేకుండా బ్లౌజ్‌ ప్యాటర్న్‌కు నెక్‌ దగ్గర జత చేసిన దుపట్టా స్టైల్‌ క్లచ్‌.ఎంబ్రాయిడరీ చేసిన లేత పచ్చ రంగు సిల్క్‌ గౌన్, దానికి జత చేసిన జరీ అంచులు గల ముదురు పసుపు దుపట్టా ప్రత్యేక ఆకర్షణ.

►లెహంగా, చోలీ, దుపట్టా ఒకే రంగులో  ఉన్న ఇండో వెస్ట్రన్‌ స్టైల్‌ లుక్‌. చోలీకి  మెడ భాగంలో జత చేసిన దుపట్టా ఈ డ్రెస్‌కి ప్రధాన ఆకర్షణ. 

►లంగా ఓణీ స్టైల్‌లో డిజైన్‌ చేసిన వెస్ట్రన్‌ గౌన్‌ ఇది. అంటే టూ ఇన్‌ వన్‌ ౖస్టైల్‌ అన్నమాట. దీనికి ఎడమ భుజం మీదుగా దుపట్టా స్టైల్‌ వచ్చేలా డిజైన్‌ చేశారు. దీంతో ఇది పూర్తిగా ఇండోవెస్ట్రన్‌    లుక్‌తో ఆకట్టుకుంటుంది. 

►లెహెంగా–ఛోలీని కలుపుతూ డిజైన్‌ చేసిన అందమైన దుపట్టా. సంప్రదాయ వేడుకల్లో ఈ స్టైల్‌ హైలైట్‌గా నిలుస్తుంది.

►వెస్ట్రన్‌ గౌన్‌కి నెటెడ్‌ దుపట్టా రెండు భుజాలమీదుగా తీసి, నడుము దగ్గర జత చేయడంతో లుక్‌లో భిన్నమైన మార్పు కనిస్తోంది.

►ఎంబ్రాయిడరీ చేసిన లాంగ్‌ డిజైనర్‌ గౌన్‌కి దుపట్టాని భుజం మీదుగా సన్నగా తీసి, కింది భాగం ఫ్లెయిర్‌ ఎక్కువ ఉండేలా జత చేశారు.

►డిజైనర్‌ లంగాఓణీలలో ఎన్నో మార్పులు వచ్చాయి. లెహంగాకు నడుము దగ్గర ఓణీని జత చేసి ఓ భిన్నమైన లుక్‌ని తీసుకువచ్చారు. 

►జార్జెట్‌ గౌన్‌కి సింపుల్‌ ఎంబ్రాయిడరీ చేసిన దుపట్టాను మెడకు హారంలా ఉండేలా జత చేశారు. 

►ఇది లెహంగా కుర్తీ స్టైల్‌. దీనికి దుపట్టా మోడల్‌ లుక్‌ వచ్చేలా పవిట, కొంగు భాగాలను హైలైట్‌ చేస్తూఎంబ్రాయిడరీతో డిజైన్‌ చేశారు. 


 

Advertisement
Advertisement