మీది కడియం మాది కడియం

Sahitya Maramaralu Meedi Kadiyam Madi Kadiyam - Sakshi

సాహిత్య మరమరాలు

నర్సరీలకు బాగా పేరొందిన తూర్పు గోదావరి జిల్లా కడియంలో కొన్ని ఎకరాల పొలం కొనుక్కుని నివసిస్తుంటారు అవధాని చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి. అవధానాలంటే సామాన్య జనంలో కూడా విస్తృత ప్రచారంలో ఉన్న రోజులవి. 
ఆ ఊళ్లోనే పెద్ద కన్నపు దొంగ ఉంటాడు. అతడు ఎవరినీ గౌరవంగా పిలవడు. అందరినీ ఏకవచనంతో సంబోధిస్తాడు. దొంగతో ఎక్కడ పెట్టుకుంటామని ఎవరూ భయపడి నోరెత్తరు.
ఒకరోజు చెళ్లపిళ్ల పొలాన్ని చూసుకుంటూ నడుస్తున్నప్పుడు, ఆ దొంగ వినయంగా వెనక వస్తుంటాడు.
‘ఏరా, సాయంత్రం మా ఇంటికి ఏమైనా విజయం చేస్తావా?’ అని వ్యంగ్యంగా అడుగుతాడు చెళ్లపిళ్ల. మా ఇంటికి ఏమైనా కన్నమేద్దామనుకుంటున్నావా అని అర్థం.
‘లేదు దొరా, మీది కడియం అని అందరికీ తెలుసు కదా, నేను ఆ మధ్య జైల్లో ఉన్నప్పుడు మన ఊరు కడియం అని తెలిసి దొంగలందరూ నన్ను గౌరవంగా చూశారు’ అని చెబుతాడు. దానికి కొనసాగింపుగా, ‘తమరి వెంట తిరిగితే నాలుగు మంచిముక్కలైనా వస్తాయి అని తిరుగుతున్నా’ అంటాడు.
దానికి చెళ్లపిళ్ల కచ్చితంగా సంబరపడే ఉంటాడు.
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top