మూర్ఛవ్యాధికి చేప చర్యలకూ లింకు!

 Link to fish operations for epilepsy - Sakshi

ఆఫ్రికా నదుల్లో ఓ విచిత్రమైన చేపజాతి ఉంది. సెకనులో అతితక్కువ సమయంపాటు విద్యుత్‌ ఛార్జ్‌ను విడుదల చేస్తాయి ఇవి. ఎందుకూ? చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు.. వేటగాళ్ల నుంచి తప్పించుకునేందుకు! సరేగానీ.. దీనికి మన జబ్బులకు ఏంటి సంబంధం అంటే టెక్సస్, మిషిగన్‌ స్టేట్‌ యూనివర్శిటీల శాస్త్రవేత్తలను అడగాల్సిందే. వీరేం చెబుతారూ అంటే.. పరిణామ క్రమంలో చేపలు అలవర్చుకున్న ఈ చర్యకు, మూర్ఛవ్యాధికీ సంబంధం ఉందీ అని! 

తోకభాగంలో ఉండే అతిచిన్న అవయవం ద్వారా కరెంటు ఉత్పత్తి చేసుకునే ఈ చేపను అర్థం చేసుకుంటే మూర్ఛతోపాటు కండరాల, గుండె వ్యాధులకు మెరుగైన చికిత్స అందించవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఇమ్మని స్వప్న అంటున్నారు. మూర్ఛవ్యాధిలో మెదడు, కండరాల నుంచి చిన్నస్థాయిలో విద్యుత్తు విడుదల అవుతుందన్నది తెలిసిందే. శరీరంలోని పొటాషియం ఛానల్స్‌లో వచ్చే మార్పుల కారణంగా విద్యుత్తు పల్స్‌కు స్పందన లేకుండా, లేదంటే కొద్దిగా మాత్రమే స్పందన కలిగి ఉండటం వల్ల మూర్ఛ వంటి వ్యాధులు వస్తాయని స్వప్న వివరించారు.  
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top