ఇంటిప్స్‌

If the Dishes are excess salt Add Tomato Slices - Sakshi

►టొమాటోలను ఉడికించి, తగినంత ఉప్పు కలిపి గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఐస్‌ ట్రేలలో పోసి డీప్‌ ఫ్రిజ్‌లో ఉంచాలి. టొమాటో ఐస్‌క్యూబ్స్‌ను ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో వేసి ఫ్రీజర్‌లోనే ఉంచాలి. అవసరమైనప్పుడు సూప్‌లు, కూరలలో గ్రేవీగా వాడుకోవచ్చు. 
   
►పాలు పొంగి అంచుభాగం అంతా పాల మరక పట్టుకునే ఉంటుంది. ఇలాంటప్పుడు, పాలు మరిగించడానికి ముందు పాత్ర పై అంచు భాగాన నెయ్యి రాస్తే పాలు త్వరగా పొంగవు, పొంగినా అంచుకు మరక పట్టదు. 
     
►వంటలలో ఉప్పు ఎక్కువైతే టొమాటో ముక్కలు లేదా బంగాళదుంప ముక్కలు లేదా టీ స్పూన్‌ పంచదార వేయాలి. 
     
►నిమ్మకాయలను ఫ్రిజ్‌లో నిల్వచేసేముందు వాటి పైన కొద్దిగా కొబ్బరి నూనె రాస్తే ఎక్కువ కాలం మన్నుతాయి. 
     
►అన్నం ముద్దగా కాకుండా ఉండాలంటే ఉడికేటప్పుడు కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top