కలలో డ్యాన్స్‌.. విషయం తెలిస్తే నిజంగానే ఎగిరి గంతేస్తారు

Here Is The Meaning Of Dancing In Dream - Sakshi

డ్యాన్స్‌ ఒక కళ, కానీ కొంతమందికి డాన్స్‌ చేయడం అనేది ఒక కల. అయితే ఈ రెండు రకాల వ్యక్తులు నిద్రలో డ్యాన్స్‌ చేస్తున్నట్టు కల కంటారు. ఇలాంటి కలలు మీకు వచ్చే ఉంటాయి. అయితే నిద్రలో డ్యాన్స్‌ చేసినట్టు కల రావటం శుభసూచకమే. అది మీ ఆనందాన్ని, స్వేచ్ఛను తెలియజేస్తుంది, మనిషి భావోద్వేగాలను ప్రతిబింబిస్తుంది. మనిషి జీవితం ఎలా కొనసాగుతుందో చెప్తుంది. ఇక నిద్రలో మీరు డ్యాన్స్‌ చేస్తున్నట్టు కలగంటే మీరు మీ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరుస్తున్నట్లు భావించాలి. భవిష్యత్తులో మీరు విజయాన్ని అందుకోనున్నారనే దానికి సంకేతం. కానీ కొంతమంది మాత్రం నిజ జీవితంలో డ్యాన్స్‌ చేయలేక.. కలలో చేస్తున్నారని అర్థం.

కలలు- రకాలు:

  • ఒంటరిగా డ్యాన్స్‌ : జీవితంలో స్పాంటేనియస్‌గా ముందుకెళుతున్నారు.
  • ఇద్దరూ లేదా ఎక్కువ : మీ చుట్టూ ఎవరైనా ఉండాలని కోరుకుంటున్నారు.
  • తికమక డ్యాన్స్‌ : జీవితానికి దూరంగా ఉ‍న్నారు లేదా జీవితంలోని దగ్గరి వ్యక్తులతో ఎడబాటుకు సంకేతం.
  • చుట్టూ పొగ, మధ్యలో డాన్స్‌ : జీవితాన్ని అభద్రతగా భావిస్తున్నారు.
  • పార్ట్‌నర్‌తో డ్యాన్స్‌ : భాగస్వామిపై మీ ప్రేమను వ్యక్తపరుస్తున్నారు లేదా మీ బంధం ఇప్పుడిప్పుడే గూడు కట్టుకుంటోంది.
  • బ్యాలెట్‌ డ్యాన్సర్లతో కలిసి డ్యాన్స్‌ : సమాజంలో మీ ఎదుగుదలకు సంకేతం.
  • పిల్లలతో కలిసి డ్యాన్స్‌ : వైవాహిక జీవితం సంతోషంగా సాగుతోంది.
  • ఒంటరిగా ఆనందంగా డ్యాన్స్‌ :  ఊహించని విజయం అందనుంది.
  • అమ్మాయితో డ్యాన్స్‌ : త్వరలో పెళ్లి లేదా ఒక అమ్మాయితో సాన్నిహిత్యం ఏర్పడనుంది.

సాధారణంగా ఏదైనా సాధించినప్పుడు, సంతోషంగా అనిపించినప్పుడు చాలామందికి మొదటగా డ్యాన్స్‌ చేయాలని అనిపిస్తుంది. డ్యాన్స్‌.. మీ భావాలను ప్రదర్శించే వేదిక.. సంతోషానికి సూచిక. కాబట్టి డ్యాన్స్‌ చేయాలనిపిస్తే.. వెంటనే ఎగిరి గంతేయండి, నచ్చినట్టు చిందేయండి. పక్కవాళ్లేమనుకుంటారోనన్న సంకోచాన్ని వీడండి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top