ఎండాకాలం... శిరోజాల సంరక్షణ... | Hair care in the summer ... | Sakshi
Sakshi News home page

ఎండాకాలం... శిరోజాల సంరక్షణ...

Mar 20 2016 2:45 AM | Updated on Sep 3 2017 8:08 PM

ఎండాకాలం...  శిరోజాల సంరక్షణ...

ఎండాకాలం... శిరోజాల సంరక్షణ...

ఈ కాలం శిరోజాలూ చమట, జిడ్డు కారణాలతో త్వరగా మురికి అవుతాయి.

బ్యూటిప్స్
 
ఈ కాలం శిరోజాలూ చమట, జిడ్డు కారణాలతో త్వరగా మురికి అవుతాయి. పొడిబారి చిట్టుతుంటాయి. ఈ సమస్యకు విరుగుడుగా ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకొని, కురుల నిగనిగలను కాపాడుకోవచ్చు.  రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె, అర టీ స్పూన్ బియ్యం, టీ స్పూన్ మిరియాలు. ఈ మూడింటిని కలిపి బియ్యం ముదురు గోధుమరంగులోకి వచ్చేవరకు మరిగించి, దించి, చల్లారనివ్వాలి. వారానికి రెండు సార్లు ఈ నూనెను వేడి చేసి, తలకు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు మృదువుగా అవడమే కాకుండా, రాలడం సమస్య తగ్గుతుంది.  

వారానికి రెండుసార్లు గోరువెచ్చని కొబ్బరి నూనెతో తలకు మసాజ్ చేసుకోవడం, నెలకు ఒకసారి హెన్నా ప్యాక్ వాడితే కురుల అందం పాడవదు.    వేడిమి వల్ల రోజూ తలస్నానం చేస్తుంటారు. దీంతో మాడు పై చర్మం పొడిబారి వెంట్రుకలు చిట్లడం, రాలడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి రాత్రి సమయాల్లో ఉసిరి, తులసి, వేప ఆకులను మరిగించిన కొబ్బరినూనెతో తలకు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే కుదుళ్లు బలంగా ఉంటాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement