రేపటి ఫన్‌డేలో...

As far as agriculture is concerned - Sakshi

యాసిడ్‌ టెస్ట్‌
గదిలో ఫ్యానుకు తాడును వేలాడదీసే ప్రయత్నంలో ఉంది రేష్మ. సమయానికి అక్కడికి తల్లి రావడంతో ప్రాణాలు దక్కాయి. పెద్దగా ఎప్పుడూ మాట్లాడని తండ్రి ఈసారి నోరు విప్పాడు.‘‘వ్యవసాయం అంత తేలిగ్గాదమ్మా. నకిలీ విత్తనాలు, కల్తీ మందులు, గిట్టుబాటు కాని ధర... ఇవన్నీ ఒక ఎత్తయితే అవసరానికి కురవని వానలు, పంట చేతికొచ్చే సమయంలో ముంచుకొచ్చే తుపాను ఒక ఎత్తు... ఈ లెక్కన నేను ఇప్పటికి వందసార్లు ఆత్మహత్య చేసుకోవాలి’’ అన్నాడు.

యాసిడ్‌ దాడికి గురై, నరకం అనుభవించిన మోడల్‌ రేషమ్‌ఖాన్‌ తిరిగి  ఎలా నిలదొక్కుకోగలిగిందో, నలుగురికి ఎలా ఆదర్శంగా నిలిచిందో  కూడా చెప్పాడు.తండ్రి మాటలతో ప్రభావితమైన రేష్మ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంతా సజావుగా సాగుతున్నప్పుడు ఆమె జీవితంలోకి రణధీర్‌ వచ్చాడు. ఇప్పుడు రేష్మాకు మరో పెద్ద సవాలు ఎదురైంది. ఆ సవాలును ధైర్యంగా ఎదుర్కొందా? పిరికితనంతో నీరుగారిపోయిందా?‘యాసిడ్‌ టెస్ట్‌’ కథలో చదవండి.

నాలుగు రోజులు
తెల్లవారుజామున పెద్దగాలి రేగింది. మసక చీకటి తొలగిపోయింది. మూడోరోజు ప్రారంభమైంది.‘‘నా జీవితంలో మూడోరోజు అనాలా? లేకపోతే నరకంలో మూడురోజులు అనాలా?’’ అనుకున్నాడు యుద్ధంలో తీవ్రంగా గాయపడిన సైనికుడు ఐవనోవ్‌. బతుక్కి దూరంగా, చావుకి అతి దగ్గరగా ఉన్నాడతడు.‘మరణమా ఎక్కడున్నావ్, దయచూడు’ అని ప్రార్థించాడు కూడా. ఆయన మొర గాలిలో కలిసిపోయింది.యుద్ధంలో గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన ఒక సైనికుడి మానసిక సంఘర్షణ...రష్యన్‌ కథ ‘నాలుగు రోజులు’లో చదవండి.

సాయిపథం
ఒక పెద్ద నాగుపాము కప్పను మింగడానికి ప్రయత్నిస్తుంటే, సాయి ఆ రెండిటి దగ్గరకు వెళ్లి...‘‘వీరభద్రప్పా! అనుక్షణం భయంతో జీవిస్తున్నా నీకు సిగ్గులేదా... చినబసప్పా! ఇంకా వాడితో ఆనాటి వైరం పోలేదా...’’ అన్నాడు. అంతే...కప్పని పాము వదిలేసింది. కప్ప ఎగిరిపోవడం, పాము పారిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. సాయి స్వయంగా  చెప్పిన కథ ‘నేటి ఈ వైరం ఏనాటిదో’లో చదవండి.
 
ఇంకా...
నక్కజిత్తుల క్యాన్సర్‌ (వరల్డ్‌ క్యాన్సర్‌ డే సందర్భంగా ముఖచిత్రకథనం), కలాన్ని, గళాన్ని ఆయుధంగా చేసుకున్న గరిమెళ్ల జీవితకథ (్ర«ధువతారలు), ‘గుణసుందరి కథ’ సినిమాలో కొత్తపదాలతో పింగళి సృష్టించిన పాట గురించి సీనియర్‌ నటి రక్తకన్నీరు సీతమ్మ మాటల్లో (పాటతత్వం)...ఇంకా మిమ్మల్ని ఆకట్టుకునే మరెన్నో శీర్షికలు రేపటి ఫన్‌డేలో చదవండి... 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top