ఇలా చేస్తే... అందం మీ సొంతం

Beauty tips:Apply on pimples to reduce acne - Sakshi

బ్యూటిప్స్‌

∙క్యారెట్, ఓట్స్‌ పౌడర్, పంచదార, పసుపు కలిపి మెత్తని పేస్ట్‌ చేసుకుని మొటిమలపై అప్లై చేసుకుంటే మొటిమలు తగ్గుతాయి.

∙ క్యారెట్, నారింజ రసం, పంచదార తీసుకుని మూడింటినీ కలిపి మెత్తని పేస్ట్‌ చేసుకోవాలి. జిడ్డు చర్మం ఉన్న వారు ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసుకుంటే ఫలితం ఉంటుంది.

∙ముఖానికి మేకప్‌ వేసుకునే ముందు క్యారెట్, నారింజ రసం రెండింటినీ కలిపి ముఖంపై వలయాకారంలో మసాజ్‌ చేయాలి. తర్వాత ముఖాన్ని చన్నీటితో కడిగేసి 20 నిమిషాల తర్వాత మేకప్‌ వేసుకోవాలి. ఇలా చేస్తే మేకప్‌ మరింత అందంగా కనబడుతుంది.

∙మెడ చుట్టూ చర్మం నల్లగా ఉన్నవారు... క్యారెట్‌ పేస్ట్‌లో నిమ్మరసం, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా మెడ చుట్టూ నల్లగా ఉన్న చర్మంపై నూనె రాసి తయారుచేసుకున్న మిశ్రమాన్ని అప్లై చేసి మసాజ్‌ చేయాలి. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top