క్రీజులో మీరు... ఆండర్సన్ బౌలింగ్! | Anderson joins Yasir Shah as number-two ranked | Sakshi
Sakshi News home page

క్రీజులో మీరు... ఆండర్సన్ బౌలింగ్!

Dec 6 2015 8:50 AM | Updated on Sep 3 2017 1:33 PM

క్రీజులో మీరు... ఆండర్సన్ బౌలింగ్!

క్రీజులో మీరు... ఆండర్సన్ బౌలింగ్!

మీరు క్రికెట్ వీరాభిమానులా? ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ వేగంగా విసిరే బంతుల్ని మీరే స్వయంగా...

మీరు క్రికెట్ వీరాభిమానులా? ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ వేగంగా విసిరే బంతుల్ని మీరే స్వయంగా క్రీజులో ఉండి ఎదుర్కొంటే ఎలా ఉంటుంది? ఊహల్లో తప్ప నిజం కాదని మీరు నిరుత్సాహపడకండి. ఇప్పుడు మీకు అలాంటి కొత్త అనుభూతిని కల్పించే హెడ్‌సెట్ ఒకటి తయారైంది. ఈ ఆక్యులస్ రిఫ్ట్ హెడ్‌సెట్‌ను ధరిస్తే, నిజమని భ్రమ కలిగించేలా వర్చ్యువల్ రియాలిటీ అనుభూతి కలుగుతుంది.

విషయం ఏమిటంటే, ఈ హెడ్‌సెట్ కోసం ఫాస్ట్ బౌలర్ ఆండర్సన్ బౌలింగ్ తాలూకు హెచ్.డి. ఫుటేజ్‌ను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. అభిమానులు ఈ హెడ్‌సెట్‌ను తలకు పెట్టుకోగానే తక్షణమే క్రీజులోకి వెళ్ళినట్లూ, గంటకు 80 మైళ్ళ వేగంతో ఆండర్సన్ వేసే బంతులను ఎదుర్కొంటున్నట్లూ అనుభూతి కలుగుతుంది.
 
యార్క్‌షైర్ టీ, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఇ.సి.బి) కలసి రూపొందించిన ఈ హెడ్‌సెట్‌కు ‘ఎ ప్రాపర్ బాల్’ అని పేరు పెట్టారు. మైదానంలో ఆట చూసేందుకు వచ్చిన క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈ వర్చ్యువల్ రియాలిటీ (వి.ఆర్) టెక్నాలజీ మరపురాని అనుభూతే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement