చంద్రబాబుకు వైఎస్‌ఆర్‌సీపీ ప్రశ్నలు | ysrcp poses questions to chandrababu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు వైఎస్‌ఆర్‌సీపీ ప్రశ్నలు

Mar 20 2014 7:47 PM | Updated on May 29 2018 4:06 PM

చంద్రబాబుకు వైఎస్‌ఆర్‌సీపీ ప్రశ్నలు - Sakshi

చంద్రబాబుకు వైఎస్‌ఆర్‌సీపీ ప్రశ్నలు

టీడీపీ అధినే చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్.కె. రోజా పలు సూటి ప్రశ్నలు సంధించారు.

టీడీపీ అధినే చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్.కె. రోజా పలు సూటి ప్రశ్నలు సంధించారు. రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది తానేనంటూ పదే పదే చెప్పుకొంటున్న చంద్రబాబును ఈ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.

ఆ ప్రశ్నలివీ..

  • తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న మిమ్మల్ని ప్రజలు ఎందుకు తిరస్కరించారు?
  • పదేళ్లు ప్రతిపక్ష నాయుకుడిగా ఎందుకు ఉండిపోవాల్సివచ్చింది?
  • మీరు చేసిన అభివృద్ధి ఏంటి? మీరు నిర్మించిన నగరం ఏది?
  • వైఎస్‌ కంటే మెరుగైన పాలన అందించామని ఏ ఒక్కరితోనైనా చెప్పించగలరా?
  • మీరు ఈ సవాల్‌ని స్వీకరించగలరా?
  • వైఎస్‌ విజయమ్మ మీపై దాఖలు చేసిన పిటిషన్‌పై దర్యాప్తుకు మీరు సిద్ధమేనా?
  • మీ హయాంలో ప్రభుత్వరంగ సంస్థలను ఎందుకు అమ్మేశారు, ఎందుకు మూసేశారు?
  • హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ భూములను ఏ హక్కుతో ఐఎంజీకి కేటాయించారు?
  • మీరు సీఎం అయ్యేనాటికి సాఫ్ట్‌వేర్‌ రంగంలో మూడోస్థానంలో ఉన్న ఏపీ మీరు దిగిపోయేనాటికి ఐదోస్థానానికి పడిపోయింది నిజం కాదా?
  • రాష్ట్ర రాజధానిలోని భూముల్ని మీ అనుయాయులకు పప్పుబెల్లాల్లా పంచింది వాస్తవం కాదా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement