హామీ సరే...! ఆచరిస్తరా? | Well ... guaranteed! Observe? | Sakshi
Sakshi News home page

హామీ సరే...! ఆచరిస్తరా?

Apr 2 2014 3:32 AM | Updated on Oct 8 2018 5:04 PM

హామీ సరే...! ఆచరిస్తరా? - Sakshi

హామీ సరే...! ఆచరిస్తరా?

బీసీలు ఇప్పుడు అన్ని పార్టీలకు ముద్దొస్తున్నారు. వారి ఆసరాగా అధికారం పట్టుకోవాలని నేతలు ఎత్తులు వేస్తున్నారు. వారికి సింహభాగం సీట్లు కేటాయించి మంచి చేసుకుంటామని చెప్తున్నా అవి ఎంత వరకు వాస్తవ రూపం దాల్చుతుందో అన్నదే ఇప్పుడు రాజకీయ పరిశీలకులను వేధిస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. మొత్తానికి ఎన్నికలు ఆ వర్గాలకు ఊతమిస్తే అంతకు మించి ఏం కావలన్నది మరికొందరి అంచనా.

 బీసీలు ఇప్పుడు అన్ని పార్టీలకు ముద్దొస్తున్నారు. వారి ఆసరాగా అధికారం పట్టుకోవాలని నేతలు ఎత్తులు వేస్తున్నారు. వారికి సింహభాగం సీట్లు కేటాయించి మంచి చేసుకుంటామని చెప్తున్నా అవి ఎంత వరకు వాస్తవ రూపం దాల్చుతుందో  అన్నదే ఇప్పుడు రాజకీయ పరిశీలకులను వేధిస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. మొత్తానికి ఎన్నికలు ఆ వర్గాలకు ఊతమిస్తే అంతకు మించి ఏం కావలన్నది మరికొందరి అంచనా. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పుడు బీసీలు రాజకీయంగా చర్చనీయసాధారణ ఎన్నికల్లో అన్ని పార్టీలు చేసే మంత్రం పఠిస్తున్నా టిక్కెట్ల కేటాయింపులో మాత్రం ఆచరించే పరిస్థితి కనిపించడం లేదు.

జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలుండగా అచ్చంపేట, ఆలంపూర్ స్థానాలు ఎస్సీలకు రిజర్వు చేశారు. మిగతా 12 స్థానాలు జనరల్ కేటగిరీకి రిజర్వు చేశారు. ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకు రెండు లేదా మూడు అసెంబ్లీ స్థానాలకు మించి కేటాయించే పరిస్థితి కనిపించడం లేదు. రెండు లోక్‌సభ స్థానాలకుగానూ నాగర్‌కర్నూల్‌ను ఎస్సీలకు రిజర్వు చేశారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్ గతంలో బీసీలకు కేటాయిస్తూ వచ్చింది. ఈ సారి కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డిని మహబూబ్‌నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ బరిలో నిలుపనున్నది. టీఆర్‌ఎస్, బీజేపీ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారినే ఎంపీ అభ్యర్థులుగా దాదాపు ఖరారు చేశాయి. టీఆర్‌ఎస్ నుంచి జితేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి నాగం జనార్దన్‌రెడ్డి పోటీపై ఆయా పార్టీలు ఇప్పటికే స్పష్టత ఇచ్చాయి. వైఎస్‌ఆర్ సీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్‌రెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయి. టీడీపీ ఒంటరి పోరుకు సిద్దమైతే అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

 20 శాతంలోపే ‘బీసీ’ సీట్లు

 వెనుకబడిన తరగతుల(బీసీ)లకు చెందిన అభ్యర్థులకు ప్రధాన పార్టీలు రెండు లేదా మూడు సీట్లకు మించి టిక్కెట్లు కేటాయించే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్‌లో మాజీ ఎంపి విఠల్‌రావు (నారాయణపేట లేదా కొడంగల్), మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్ (కల్వకుర్తి), దిలీపాచారి (నాగర్‌కర్నూల్), విశ్వేశ్వర్ లేదా ప్రదీప్‌కుమార్ గౌడ్ (దేవరకద్ర) మాత్రమే టిక్కెట్ రేసులో ఉన్నారు. వీరిలో ఒకరు లేదా ఇద్దరికే మాత్రమే టిక్కెట్ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
 
టిఆర్‌ఎస్ విషయానికి వస్తే ఎమ్మెల్యేలు ఎల్కోటి ఎల్లారెడ్డి(మక్తల్), జైపాల్ యాదవ్ (కల్వకుర్తి), టీజీఓ నేత వి.శ్రీనివాస్‌గౌడ్ (మహబూబ్‌నగర్) పేర్లపై దాదాపు స్పష్టత ఇచ్చింది. ఒకవేళ గరిష్టంగా బీసీలకు టిక్కెట్లు ఇవ్వాలనుకుంటే అంజయ్య యాదవ్ (షాద్‌నగర్)కు టిక్కెట్ దక్కే అవకాశం ఉంది.

 బీసీలకు సీఎం పదవి అంటున్న తెలుగుదేశం టిక్కెట్ల కేటాయింపు బీజేపీతో పొత్తులపై ఆధారపడనుంది. ఇప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ (జడ్చర్ల), ఎన్‌పి.వెంకటేష్ (మహబూబ్‌నగర్) మినహా మరో పేరు వినిపించలేదు. ఒంటరి పోరుకు సిద్దమైతే షాద్‌నగర్ అసెంబ్లీ సీటు బీసీలకు కేటాయించాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ విషయానికి వస్తే మక్తల్, కొడంగల్, కల్వకుర్తి స్థానాల నుంచి బీసీలకు కేటాయించే అవకాశం ఉంది. మైనార్టీలకు సీట్ల విషయానికి వస్తే కాంగ్రెస్‌తరపున డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, సయ్యద్ ఇబ్రహీం, వైఎస్‌ఆర్ సీపీ తరపున మైనార్టీ విభాగం అధ్యక్షుడు రహమాన్ పేర్లు మాత్రమే మహబూబ్‌నగర్ స్థానం నుంచి పరిశీలనలో ఉన్నాయి.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement