breaking news
BC seats
-
కూటమి సీట్లలో బీసీలకు ప్రాధాన్యతివ్వాలి: కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: వచ్చే తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి వర్గాలు బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తాయని ఆశిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం పేర్కొం ది. గురువారం బీసీ భవన్లో 12 బీసీ సంఘాల సమావేశం జరిగింది. బీసీలకు చట్టసభల్లో రిజ ర్వేషన్లు ఇచ్చే అంశంపై రాజకీయ పార్టీలు తమ వైఖరిని ప్రకటించాలని, ఎన్నికల మేనిఫెస్టోలో దీనిపై స్పష్టత ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం కోరింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ కూటమి సీట్లలో బీసీలకు ప్రాధాన్యతివ్వాలన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు బురిడీ
-
బీసీలకు బురిడీ
* 50% సీట్లిస్తానన్న హామీకి బాబు నీళ్లు * తెలంగాణ పోటీ చేస్తున్న 72 అసెంబ్లీ స్థానాల్లో బీసీల వాటా 18 (25%) మాత్రమే * మైనారిటీలకు నాలుగే * రెడ్డి వర్గానికి 16 సీట్లు, కమ్మ వర్గానికి 6, వెలమలకు 3, * 9 మంది ఎంపీ అభ్యర్థుల్లో దేవేందర్‌గౌడ్ కుమారుడు ఒక్కరే బీసీ.. బాబు తీరుపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన సాక్షి, హైదరాబాద్: ‘బీసీలకు రాజ్యాధికారమే నా స్వప్నం. అది నా ద్వారానే సాధ్యం..’ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన ప్రచారంలో ఊదరగొడుతున్నారు... ‘బీసీలకు జనాభా ఆధారంగా యాభై శాతం సీట్లు దక్కితేనే నిజమైన రాజ్యాధికారం దక్కినట్లు! అది ఒక్క చంద్రబాబు ద్వారానే సాధ్యం...’ అంటూ తెలుగుదేశం పార్టీ తరఫున బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్య లేని గొప్పలు ప్రచారం చేస్తున్నారు... తీరా చూస్తే టీడీపీ తెలంగాణలో పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు ఇచ్చిన టికెట్లు అక్షరాలా పద్దెనిమిది.. అంటే కేవలం 25 శాతమే! ఇక లోక్‌సభ స్థానాల్లోనైతే ఒకే ఒక్క సీటును బీసీలకు ఇచ్చారు.. అది కూడా దేవేందర్‌గౌడ్ కువూరుడికి ఇచ్చిన సీటు. ఇదీ చంద్రబాబు మార్కు సామాజిక న్యాయం! ఇదే చంద్రబాబు ప్రవచిస్తున్న సామాజిక తెలంగాణ! చంద్రబాబు తీరుపై తెలంగాణలో బీసీలు మండిపడుతున్నారు. ‘సీఎంగా బీసీని చేస్తానని ప్రకటించేస్తే చాలా..? బీసీలకు కనీసం వారి జనాభాకు తగినట్లయినా సీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని చంద్రబాబు భావిస్తున్నారా? వురి జనాభా ఆధారంగా యూభై శాతం టికెట్లు దక్కనప్పుడు.. నిజమైన రాజ్యాధికారం ఎలా సాధ్యవువుతుంది?..’ అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అగ్రవర్ణాల్లోని మూడు కులాలకు కట్టబెట్టిన టికెట్ల సంఖ్య 25. రెడ్డి వర్గానికి 16, వెలమ వర్గానికి మూడు సీట్లు ఇచ్చిన చంద్రబాబు తన కమ్మ సామాజిక వర్గానికి తెలంగాణలో ఆరు సీట్లు ఇచ్చారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ స్థానానికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన రావి శ్రీనివాస్‌కు టికెట్ ఇచ్చిన బాబు... ఖమ్మంలో ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లు పోగా మిగిలిన మూడు జనరల్ స్థానాలనూ కమ్మ వర్గానికే కేటాయించడం జిల్లాలో చర్చనీయాంశమైంది. కొత్తగూడెంను తొలుత బీసీ నేత బాలసానికి ప్రకటించిన చంద్రబాబు.. తరువాత ఎంపీ నామా ఒత్తిడికి లొంగి కమ్మ వర్గానికి చెందిన కోనేరు సత్యనారాయణకు ఇచ్చారు. మరోవైపు బ్రాహ్మణ, వైశ్య వంటి సామాజిక వర్గాలను పరిగణనలోకే తీసుకోలేదు. లోక్‌సభకు ఒకే ఒక్క బీసీకి అవకాశం తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో టీడీపీ తొమ్మిందింటి లో పోటీ చేస్తోంది. ఇందులో తప్పనిసరి పరిస్థితుల్లో చివరి నిమిషంలో ఒకే ఒక్క బీసీకి చేవెళ్ల ఎంపీ టికెట్ ఇచ్చారు. అది కూడా సీనియర్ నేత దేవేందర్‌గౌడ్ కుమారుడు వీరేందర్‌గౌడ్‌కు కావడం గమనార్హం. అసలు వీరేందర్‌కు ఉప్పల్ అసెంబ్లీ స్థానం అనుకుని, చివరి నిమిషంలో చేవెళ్ల ఎంపీ సీటు ఇచ్చారు. లేకపోతే ఈ ఒక్క ఎంపీ సీటు కూడా బీసీల కోటాలో చేరేది కాదు. చేవెళ్ల నుంచి రెడ్డి వర్గానికి లేదా కమ్మ వర్గానికి చెందిన వ్యక్తిని పోటీ చేయించాలని బాబు చివరివరకు యోచించడం తెలిసిందే. మిగతా సీట్లలో మల్కాజ్గిరి, నల్లగొండ స్థానాలను రెడ్డి వర్గానికి ఇచ్చిన బాబు.. జహీరాబాద్‌ను ఎర్రబెల్లి దయాకర్‌రావు అల్లుడు కె.మదన్‌మోహన్‌రావుకు కేటాయించారు. ఖమ్మం స్థానాన్ని యథావిధిగా కమ్మ వర్గానికి చెందిన నామా నాగేశ్వర్రావుకు కేటాయించారు. మరోవైపు.. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి ముగ్గురు సిట్టింగ్ బీసీ ఎంపీలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక న్యాయం అంటూ ఏ ముఖం పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్లాలని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక న్యాయం ఇదేనా? సామాజిక తెలంగాణ, అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం అంటూ ఊదరగొట్టే బాబు అసెంబ్లీ జనరల్ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీలకు ఎక్కడా అవకాశం కల్పించలేదు. అనేక నియోజకవర్గాల్లో ఎస్సీ వర్గానికి చెందిన నాయకులు టికెట్ కోసం పోటీ పడ్డా... వారిని రెండోశ్రేణి నాయకత్వానికే పరిమితం చేశారు. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఒక్క బీసీకీ టికెట్ ఇవ్వలేదు. నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో పేరుకు మాత్రం ఒక్కొక్క బీసీకి టికెట్ ఇచ్చారు. బీసీని సీఎం చేస్తానంటూ.. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను పార్టీలో చేర్చుకొని ఎల్బీ నగర్ సీటిచ్చిన చంద్రబాబు... మరి రాష్ట్రంలో బీసీలకు ఇచ్చిన సీట్ల సంఖ్య విషయంలో ఏం చెపుతారో? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. -
హామీ సరే...! ఆచరిస్తరా?
బీసీలు ఇప్పుడు అన్ని పార్టీలకు ముద్దొస్తున్నారు. వారి ఆసరాగా అధికారం పట్టుకోవాలని నేతలు ఎత్తులు వేస్తున్నారు. వారికి సింహభాగం సీట్లు కేటాయించి మంచి చేసుకుంటామని చెప్తున్నా అవి ఎంత వరకు వాస్తవ రూపం దాల్చుతుందో అన్నదే ఇప్పుడు రాజకీయ పరిశీలకులను వేధిస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. మొత్తానికి ఎన్నికలు ఆ వర్గాలకు ఊతమిస్తే అంతకు మించి ఏం కావలన్నది మరికొందరి అంచనా. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పుడు బీసీలు రాజకీయంగా చర్చనీయసాధారణ ఎన్నికల్లో అన్ని పార్టీలు చేసే మంత్రం పఠిస్తున్నా టిక్కెట్ల కేటాయింపులో మాత్రం ఆచరించే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలుండగా అచ్చంపేట, ఆలంపూర్ స్థానాలు ఎస్సీలకు రిజర్వు చేశారు. మిగతా 12 స్థానాలు జనరల్ కేటగిరీకి రిజర్వు చేశారు. ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకు రెండు లేదా మూడు అసెంబ్లీ స్థానాలకు మించి కేటాయించే పరిస్థితి కనిపించడం లేదు. రెండు లోక్‌సభ స్థానాలకుగానూ నాగర్‌కర్నూల్‌ను ఎస్సీలకు రిజర్వు చేశారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్ గతంలో బీసీలకు కేటాయిస్తూ వచ్చింది. ఈ సారి కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డిని మహబూబ్‌నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ బరిలో నిలుపనున్నది. టీఆర్ఎస్, బీజేపీ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారినే ఎంపీ అభ్యర్థులుగా దాదాపు ఖరారు చేశాయి. టీఆర్ఎస్ నుంచి జితేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి నాగం జనార్దన్‌రెడ్డి పోటీపై ఆయా పార్టీలు ఇప్పటికే స్పష్టత ఇచ్చాయి. వైఎస్ఆర్ సీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్‌రెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయి. టీడీపీ ఒంటరి పోరుకు సిద్దమైతే అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. 20 శాతంలోపే ‘బీసీ’ సీట్లు వెనుకబడిన తరగతుల(బీసీ)లకు చెందిన అభ్యర్థులకు ప్రధాన పార్టీలు రెండు లేదా మూడు సీట్లకు మించి టిక్కెట్లు కేటాయించే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్‌లో మాజీ ఎంపి విఠల్‌రావు (నారాయణపేట లేదా కొడంగల్), మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్ (కల్వకుర్తి), దిలీపాచారి (నాగర్‌కర్నూల్), విశ్వేశ్వర్ లేదా ప్రదీప్‌కుమార్ గౌడ్ (దేవరకద్ర) మాత్రమే టిక్కెట్ రేసులో ఉన్నారు. వీరిలో ఒకరు లేదా ఇద్దరికే మాత్రమే టిక్కెట్ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. టిఆర్ఎస్ విషయానికి వస్తే ఎమ్మెల్యేలు ఎల్కోటి ఎల్లారెడ్డి(మక్తల్), జైపాల్ యాదవ్ (కల్వకుర్తి), టీజీఓ నేత వి.శ్రీనివాస్‌గౌడ్ (మహబూబ్‌నగర్) పేర్లపై దాదాపు స్పష్టత ఇచ్చింది. ఒకవేళ గరిష్టంగా బీసీలకు టిక్కెట్లు ఇవ్వాలనుకుంటే అంజయ్య యాదవ్ (షాద్‌నగర్)కు టిక్కెట్ దక్కే అవకాశం ఉంది. బీసీలకు సీఎం పదవి అంటున్న తెలుగుదేశం టిక్కెట్ల కేటాయింపు బీజేపీతో పొత్తులపై ఆధారపడనుంది. ఇప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ (జడ్చర్ల), ఎన్‌పి.వెంకటేష్ (మహబూబ్‌నగర్) మినహా మరో పేరు వినిపించలేదు. ఒంటరి పోరుకు సిద్దమైతే షాద్‌నగర్ అసెంబ్లీ సీటు బీసీలకు కేటాయించాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ విషయానికి వస్తే మక్తల్, కొడంగల్, కల్వకుర్తి స్థానాల నుంచి బీసీలకు కేటాయించే అవకాశం ఉంది. మైనార్టీలకు సీట్ల విషయానికి వస్తే కాంగ్రెస్తరపున డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, సయ్యద్ ఇబ్రహీం, వైఎస్ఆర్ సీపీ తరపున మైనార్టీ విభాగం అధ్యక్షుడు రహమాన్ పేర్లు మాత్రమే మహబూబ్‌నగర్ స్థానం నుంచి పరిశీలనలో ఉన్నాయి.